బాహుబలి ఎఫెక్ట్ : ప్రభాస్ కెరీర్‌లో తొలి నంది

Prabhas gets First Nandi Award for Mirchi

Prabhas gets First Nandi Award for Mirchi

ఈశ్వర్ సినిమాతో 2002లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యంగ్ రెబల్ స్టార్‌గా మారిన ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు అనేక ఒడిదుడుకులను చవిచూసాడు. సినిమాలు హిట్టై, బాక్సాఫీస్ దగ్గర బంపర్ బొనాంజా కొట్టినప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పెద్ద అవార్డులేవీ ప్రభాస్‌ చెంతకు చేరలేదు. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించినప్పటికీ సైమా, ఫిల్మ్‌ఫేర్‌వంటి అవార్డులను మాత్రం గెలుచుకోలేకపోయాడు. అయితే బాహుబలి సినిమా ఎఫెక్టో ఏమోగాని ప్రభాస్ కెరీర్‌లో తొలి నంది అవార్డును మిర్చి సినిమాకు గెలుచుకున్నాడు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన మిర్చి సినిమా 2013 సంవత్సరానికిగాను నంది అవార్డుల పంట పండించింది. సినిమా విడుదైలన తర్వాత ఫిల్మ్‌ఫేర్, సైమా అవార్డుల్లో చాలా క్యాటెగిరీలకు నామినేట్ అయినప్పటికీ రెండు అవార్డులు మాత్రమే వచ్చాయి. అప్పట్లో ఫిల్మ్‌ఫేర్‌, సైమాల్లో బెస్ట్ యాక్టర్ క్యాటెగిరీలో ప్రభాస్ పేరు నామినేట్ అయినప్పటికీ అదృష్టం మాత్రం వరించలేకపోయింది. అయితే మిర్చి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలవడమేకాకుండా ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా మంచి పేరుని తెచ్చిపెట్టింది.

కాకతాళీయంగా జరిగినా, బాహుబలి సినిమాను దృష్టిలో ఉంచుకున్నప్పటికీ మిర్చి సినిమాకు నాలుగేళ్ళ తర్వాత నంది అవార్డుల రూపంలో అదృష్టం వరించింది. 2013నంది అవార్డుల ప్రకటనలో ఉత్తమ చిత్రంగా ఎంపికవడమేకాకుండా ప్రభాస్‌కు ఉత్తమనటుడు అవార్డును తెచ్చిపెట్టింది మిర్చి. దీంతో బాహుబలి పుణ్యమా అని ప్రభాస్‌కు పదిహేనేళ్ళ కెరీర్‌లో మొదటి నంది దక్కినట్టైంది.

 

2013 నంది అవార్డులు

ఉత్తమ చిత్రం : మిర్చి
రెండో ఉత్తమ చిత్రం : నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రం : ఉయ్యాల జంపాల
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం : అత్తారింటికి దారేది
ఉత్తమ హీరో : ప్రభాస్ (మిర్చి)

ఉత్తమ విలన్ : సంపత్ రాజ్ (మిర్చి)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ హీరోయిన్ : అంజలి పాటిల్  (నా బంగారు తల్లి)
ఉత్తమ దర్శకుడు : దయా కొడవగంటి (అలియాస్ జానకి)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది)
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ సహాయ నటి : నదియా (అత్తారింటికి దారేది)
ఎస్వీ రంగారావు పురస్కారం : నరేష్ (పరంపర)
ఉత్తమ హాస్య నటుడు : తాగుబోతు రమేష్ ( వెంకటాద్రి ఎక్స్‑ప్రెస్)
ఉత్తమ మాటల రచయిత : త్రివిక్రమ్ శ్రీనివాస్ ( అత్తారింటికి దారేది)
ఉత్తమ గేయ రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రీ ( మరీ అంతగా, సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు)
ఉత్తమ గాయకుడు : కైలాష్ ఖేర్ ( పండగలా దిగివచ్చాడు, మిర్చి)
ఉత్తమ గాయని : కల్పన (నవ మూర్తులైనట్టి, ఇంటింటా అన్నమయ్య)
ఉత్తమ బాల నటి : ప్రణవి ( ఉయ్యాల జంపాల)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత : మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్‑ప్రెస్)
ఉత్తమ కథా రచయిత : ఇంద్రగంటి మోహనకృష్ణ ( అంతుకు ముందు ఆ తరువాత)
ఉత్తమ కళాదర్శకుడు : ఏ ఎస్ ప్రకాష్ (మిర్చి)

Have something to add? Share it in the comments

Your email address will not be published.