శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

pranab-mukherjee-visits-tirumala-tirupati-devasthanam

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ పండితులు వేదాశీర్వచనాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన రాష్ట్రపతి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి దర్శనానికి ముందు ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి శ్రీ వరాహస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం టీటీడీ చైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి సాంబశివరావు రాష్ట్రపతిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్రపతి అక్కడి నుండి తిరుచానూరు చేరుకొని పద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.