పాకిస్తాన్‌పై ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు

Praveen Togadia Sensational Comments on Pakistan Cease Fire violation

Praveen Togadia Sensational Comments on Pakistan Cease Fire violation

గత కొన్ని నెలలుగా భారత సరిహద్దుల్లో జొరబడి మన సైనికులను దొంగచాటుగా మట్టుబెడుతున్న పాకిస్తాన్ సైనికుల దుశ్చర్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమౌతున్నాయి. మొన్నటికి మొన్న సరిహద్దుల్లో ఇద్దరు భారత జవాన్లను చంపిన తర్వాత పాకిస్తాన్ చర్యలను అందరూ ఖండిస్తున్నారు.

లేటెస్ట్‌గా విశ్వ హిందు పరిషత్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా పాకిస్తాన్‌ చర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్‌ సైనికులు మన ఇద్దరు జవాన్ల తలలు తీసుకెళ్లినందుకు బదులుగా.. మనం 50 మంది పాకిస్తాన్‌ సైనికుల తలలను తెగ నరకాలి. మనదేశంపై పాకిస్తాన్‌ అప్రకటిత యుద్ధం చేస్తోంది.’ తొగాడియా స్పస్టంచేశారు.

తిరుమలలో పర్యటిస్తున్న తొగాడియా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రవీణ్ తొగాడియా గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌పై భారత్‌ బాంబు వేసి, ఆ దేశం మరణశిక్ష విధించిన మన నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను విడిపించాలని తొగాడియా గత నెలలో అన్నారు.

మొత్తానికి పాకిస్తాన్ సైనిక చర్యలపై ఒకరి తర్వాత ఒకరు ఘాటుగానే మండిపడుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.