మొన్న మోడీ … నేడు ప్రణబ్

ఆరు నెలలపాటు మంచుతో కప్పబడి ఉండే చార్‌ధామ్ యాత్రలను  ఒకరి తర్వాత ఒకరు సందర్శించుకుంటున్నారు. ఆరునెలల తర్వాత చార్‌ధామ్‌ యాత్ర తిరిగి ప్రారంభమైంది. అక్షయతృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచారు. ఏప్రిల్‌ 3న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు తెరిచిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిపూజ చేశారు. చివరిదైన బద్రీనాథ్‌ ఆలయం ఈరోజు తెరుచుకుంది.

ఈరోజు ఉదయం బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌, గవర్నర్‌ కేకే పాల్‌ ఉన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో బద్రీనాథ్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

2013లో జరిగిన విపత్తు కారణంగా చార్‌ధామ్‌ యాత్రలో భద్రతపై పలు అపోహలు తలెత్తుతున్న నేపథ్యంలో.. ప్రధాని, రాష్ట్రపతి ఈ రెండు క్షేత్రాలను దర్శించుకోవడంతో యాత్ర సురక్షితమనే సందేశం పర్యాటకులకు వెళ్తుందని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం భావిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.