`పింక్’ చిత్రాన్ని వీక్షించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

హైదరాబాద్: రాష్ట్రపతి ఓ సినిమా గొప్పదనం గురించి తెలుసుకుని.. ఆ చిత్ర బృందంతో కలిసి సినిమాను ప్రత్యేకంగా వీక్షించడం.. వారికి విందు ఏర్పాటు చేయడం అన్నది అరుదుగా జరిగే విషయం. ఈ అరుదైన గౌరవం అమితాబ్ బచ్చన్.. తాప్సి పన్ను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన  చిత్రానికి దక్కింది. ఈ సినిమాను శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా వీక్షించారు.

ఆధునిక మహిళపై సాగుతున్న అత్యాచారాలను, చూపుతున్న వివక్షతను ప్రశ్నిస్తూ రూపొందించిన సినిమా పింక్. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్‌ లో, తాప్సీ మరో కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ఆండ్రియా తరియంగ్, కీర్తి కుల్హర్లు లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారీ కలెక‌్షన్లు సాధించటమే కాక విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

పింక్ చిత్రం అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో సాగే సినిమా. ఇందులో తాప్సి ఒక బాధితురాలి పాత్ర పోషించింది. అమితాబ్ లాయర్ గా కనిపించారు. ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ సాగే ఈ కోర్ట్ రూం డ్రామా.. చివర్లో గొప్ప సందేశంతో ముగుస్తుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు కూడా సాధించిన ‘పింక్’ గత కొన్నేళ్లలో ఇండియాలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

పింక్ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడటమే కాక ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమాను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వీక్షించారు. శనివారం చిత్ర బృందంతో కలిసి ప్రణబ్‌ సినిమాను చూశారు.  అయితే అంతక మందు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో పాటు సినిమా చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానని తాప్సి తెలిపింది. అమితాబ్ బైపోలార్ డిజార్డర్ తో ఇబ్బంది పడే లాయర్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకుడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.