14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌

Presidential Election Results 2017: Ramnath Kovind Elected 14th President of India

Presidential Election Results 2017: Ramnath Kovind Elected 14th President of India

న్యూఢిల్లీ: భారతదేశం 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్ ఎన్నికయ్యారు. తొలి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లిన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌,  యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌ పై 65.65 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు.

మొత్తం నాలుగు టెబుళ్లపై ఎనిమిది రౌండ్లలో చేపట్టిన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రామ్‌నాథ్‌ 7,02, 644 ఓట్లు సాధించారు. యూపీఏ అభ్యర్ధి మీరాకుమార్‌ 3,67,314 ఓట్లు సాధించారు. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కోవింద్‌ గెలుపుతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.