ఎంత తేడా: నిన్న మొహం చాటేసి…. ఈ రోజు ఘనస్వాగతం

Presidential Polls: Ramnath Kovind lunch meet with TRS and YSRCP leaders at Hyderabad

రాష్ట్రపతి ఎన్నికల ప్రచార హోరు ఊపందుకుంది. నిన్న యుపిఎ అభ్యర్థి మీరా కుమార్ వచ్చిన వెళ్ళిన తరువాతి రోజే ఎన్‌డిఎ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ భాగ్యనగరంలో పర్యటించారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో అప్పటి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరా కుమార్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండి ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలవడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాని ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌కు మాత్రం నగరం మొత్తం పెద్ద పెద్ద ఫ్లెక్లీ బ్యానర్లు పెట్టి తెగ హడావిడి చేశారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన కోవింద్‌కు బీజేపి నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత వైసీపీ ప్రజాప్రతినిధులతో పార్క్ హయత్ హోటల్‌లోనూ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో జలవిహార్‌లోనూ విడివిడిగా భేటీ అయ్యారు రామ్‌నాథ్ కోవింద్.

Presidential Polls: Ramnath Kovind lunch meet with TRS and YSRCP leaders at Hyderabad

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా భాగ్యనగరానికి వచ్చిన ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విందు ఇచ్చారు. జలవిహార్‌లో ఏర్పాటుచేసిన ఈ విందు కార్యక్రమానికి కోవింద్‌తోపాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పలువురు బీజేపీ నేతలు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌  హిందీలో మాట్లాడుతూ రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్‌పై ప్రశంసల జల్లు కురింపించారు.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు నగరానికి ఆహ్వానించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్‌ ఘనవిజయం సాధిస్తారని, దేశ రాష్ట్రపతిగా ఆయన విజయవంతంగా కావాలని ఆకాంక్షించారు. అంతేగాక రాష్ట్రపతి పదవికి ఆయన వన్నె తెస్తారని, ఆ ఉన్నతమైన పదవి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తారని విశ్వాసం తమకుందని చెప్పుకొచ్చారు.

See Also: టీఆర్ఎస్ మద్దతు కోసం కూడా ప్రయత్నించాం

చాలా తక్కువ సమయంలో తెలంగాణను భారత్ అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టామని, అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న రాష్ట్రంగా ముందంజలో ఉన్నామని రామ్‌నాథ్ కోవింద్‌కు తెలియచేశారు కేసీఆర్. అన్ని విధాలా అర్హత ఉన్నందునే రామ్‌నాథ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. వివాద రహితుడు, రచయిత, మంచి వక్త, రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి కాబట్టే రామ్‌నాథ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించామన్నారు వెంకయ్య నాయుడు. రామ్‌నాథ్‌ రాజ్యసభ సభ్యుడిగా రెండుస్లారు పనిచేశారని.. బీహార్‌ గవర్నర్‌‌గా పనిచేశారని తెలిపారు.

మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో వైసీపీ అధినేత జగన్‌, ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైకాపా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలను జగన్‌ స్వయంగా రామ్‌నాథ్‌కు పరిచయం చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జగన్‌ ఇప్పటికే తన మద్దతు రామ్‌నాథ్‌కు ప్రకటించారు.

Presidential Polls: Ramnath Kovind lunch meet with TRS and YSRCP leaders at Hyderabad

కేసీఆర్‌ ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్న కోవింద్‌ ఆ తర్వాత విజయవాడకు వెళ్ళి అక్కడ టీడీపీ నాయకులను కలువనున్నారు. నిన్న యుపిఎ అభ్యర్థి మీరా కుమార్ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు మొహం చాటేసిన కేసీఆర్, ఈరోజు రామ్‌నాథ్ కోవింద్‌ను మాత్రం ఘనంగా సన్మానించారు.

See Also: పీఠం కోసం తెర వెనుక మంతనాలు

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.