టీఆర్ఎస్ మద్దతు కోసం కూడా ప్రయత్నించాం

Presidential Polls: UPA Candidate Meira Kumar visits Hyderabad

రాష్ట్రపతి ఎన్నికల ప్రచార హోరు రోజు రోజుకి పెరుగుతోంది. యుపిఎ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ స్పీకర్ మీరా కుమార్ దక్షిణాదిలోని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ప్రచారంలో భాగంగా చెన్నై, బెంగళూరుల్లో పర్యటించిన మీరా కుమార్ ఈరోజు హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు.

Presidential Polls: UPA Candidate Meira Kumar visits Hyderabad

రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతు ప్రకటించిన 17 విపక్షాలకు  ధన్యవాదాలు తెలిపిన మీరా కుమార్ దేశంలో విలువలు, తత్వాన్ని, సిద్ధాంతాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో కాంగ్రెస్‌ నేతలు ఘనస్వాగతం పలికారు. శంషాబాద్‌ నుంచి ఆమె నేరుగా గాంధీభవన్‌ చేరుకుని కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ సొసైటీ భవనంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పత్రికా ఎడిటర్లు, రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.

See Also: పీఠం కోసం తెర వెనుక మంతనాలు

తాను స్పీకర్‌గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అదొక చారిత్రక ఘట్టంమని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే అప్పటి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని, నాకు మద్దతు పలకాలని తెలంగాణ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు మీరా కుమార్. తాను ఒంటరిని కానని, తనకు చాలా మంది మద్దతుందని, తాను భావస్వేచ్ఛ కోసం పోరాడుతున్నానని స్పష్టంచేశారు.

Presidential Polls UPA Candidate Meira Kumar visits Hyderabad

సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో ఉన్నానని, తప్పక విజయం సాధిస్తామన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తంచేశారు. తనకు మద్దతు ఇవ్వాలని ఎంఐఎంను కూడా కోరుతున్నానని తెలిపారు మీరా కుమార్. అంతేగాక  టీఆర్‌ఎస్‌ మద్దతు కోసం ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించామని, అయితే ఆయన అందుబాటులోకి రాలేదన్నారు.

See Also: ర్యాంకు మెరుగుపడకపోతే నో టికెట్: చంద్రబాబు

Have something to add? Share it in the comments

Your email address will not be published.