భారీ చిత్రాల నిర్మాతగా మారనున్న జర్నలిస్ట్, పీఆర్వో మహేష్ కోనేరు

PRO Mahesh koneru turns into Producer with East Coast Productions and lined up 3 high budget projects

PRO Mahesh koneru turns into Producer with East Coast Productions and lined up 3 high budget projects

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్లుగా సినిమాలు తీయాలంటే భారీగా ఖర్చుపెట్టాల్సిందే. ఈమధ్య వస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్‌వే… సినిమాలు సక్సెస్ అయి బాక్సాఫీస్ దగ్గర భారీగానే వసూలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న బడ్జెట్ సినిమాలు తీయడానికి కొత్తగా నిర్మాతలుగా మారే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలను తీయలనే ఉద్దేశ్యంతో నిర్మాతగా మారే వారి సంఖ్య చాలా తక్కువ.

తెలుగు సినిమా జర్నలిస్టుగా, ఎన్టీయార్ ఆర్ట్స్, మైత్రీ మూవీస్, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లాంటి భారీ నిర్మాణ సంస్థలకు పీఆర్వోగా పనిచేసిన మహేష్ కోనేరు సినీ నిర్మాతగా మారనున్నారు. గత కొంతకాలంగా  పీఆర్వోగా పనిచేస్తున్న మహేశ్ లేటెస్ట్‌గా ప్రపంచస్థాయి పేరు సంపాదించిన ఇండియన్ ఎవర్ బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలికి మహేష్ తన స్నేహితుడు వంశీ కాకతో కలిసి పీఆర్వోగా పనిచేశారు. ఆయన జీవితంలో బాహుబలి మరో మైలురాయిగా నిలించిందనే చెప్పుకోవచ్చు.

ఇక ఇప్పుడు తాజాగా ఆయన సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు వరుసగా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు కథ రెడీ చేసుకున్న మహేశ్ కోనేరు మరి కొద్దిరోజుల్లో ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

దీంతో పాటు మరో మూడు ప్రాజెక్టుల్నిత్వరలో ఫైనల్ చేయబోతున్నారని సమాచారం. అటు స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూనే… యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేసేందుకు చిన్న చిత్రాల్ని కూడా నిర్మించనున్నారు మహేష్ కోనేరు. జర్నలిస్ట్ గా ప్రయాణం ప్రారంభించి… పిఆర్ఓగా ఎదిగి… సినీ నిర్మాతగా దూసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు మహేష్ కోనేరు.

ఆల్ ది బెస్ట్ మహేశ్ కోనేరు…

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.