హనుమంతుడి పాత్ర చాలా కీలకం: నిర్మాత గురురాజ్

Producer Gururaj very much confident about Rakshakabhatudu

 

 

సినిమా ఆర్టిస్ట్ అవుదామని హైదరాబాద్‌కి వచ్చి అవకాశాలు రాక కృష్ణానగర్‌లో పస్తులుండి పొట్ట కూటికోసం భూతల్లిని నమ్ముకొని రియల్‌ఎస్టేట్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వ్యాపారవేత్త సుఖీభవ కన్‌స్ట్రక్షన్స్ అధినేత గురురాజ్. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఉన్న అభిమానంతో సుఖీభవ మూవీస్‌ పతాకం బ్యానర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో నిర్మిస్తున్న తొలిచిత్రం రక్షకభటుడు. సినిమాపై ప్రేమతో మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంటరైన గురురాజ్ మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా గురు రాజ్ మాట్లాడుతూ ‘ ఆంజ‌నేయ‌స్వామి మంగ‌ళ‌వారం రోజే సీత‌మ్మ‌వారిని లంక‌నుంచి తీసుకొచ్చార‌ట‌. ఆంజ‌నేయ స్వామి పుట్టిన‌రోజును హ‌నుమ‌త్‌జ‌యంతిగా జ‌రుపుకుంటాం. అదే రోజు నా పుట్టిన‌రోజు కూడా రావ‌డం చాలా ఆనందంగా ఉంది. నేను ఆంజ‌నేయ‌స్వామి ఉపాస‌కుడిని. ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ‌గారు క‌థే హీరోగా ర‌క్ష‌క‌భ‌టుడు చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. కథే ఈ సినిమాకు ప్రాణం. ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తవలేదు. దీంతో పాటు ఆంజనేయ స్వామి పాత్ర సినిమాలో చాలా కీలకం. సర్ ప్రైజింగ్ స్టార్ ఇందులో నటించాడు. దానికి సంబంధించిన గ్రాఫిక్స్ ఇంకా పూర్తవలేదు. మా సంస్థ బ్రాండ్‌కి త‌గిన‌ట్టుగా సినిమా ఉంటుంది. సుఖీభ‌వ వెంచ‌ర్స్ అన‌గానే రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఓ న‌మ్మ‌కం ఉంటుంది. అలాగే మా సంస్థ‌ నుంచి వ‌స్తున్న ప్రొడ‌క్ష‌న్‌లోనూ అదే న‌మ్మ‌కం ప్ర‌తిఫ‌లిస్తుంద‌ని ఆశిస్తున్నాను.’

‘ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటుందీ సినిమా. ఇప్ప‌ట్లో ఏ సినిమాకు ఫ్యామిలీతో వెళ్లే ప‌రిస్థితులు లేవు. కొత్త కొత్త క్రియేటివ్ డైర‌క్ట‌ర్లు, క్రియేట్ చేసే క‌థ‌ల్లో హాస్యం ఎన్ని పాళ్లు ఉంటుందో, శృంగారం ఎన్ని పాళ్లు ఉంటాయో తెలియ‌వు. టీవీలో కూడా కొన్ని యాడ్స్ వ‌చ్చిన‌ప్పుడు చానెల్స్ని మార్చే ప‌రిస్థితి ఉంది. ఎక్కువ శృంగారాన్నిపెట్టి క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ చేయాల‌నుకోవ‌డం త‌ప్పు. సుఖీభ‌వ సంస్థ మీద వ‌చ్చే సినిమాల‌న్నీ ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంటాయి. ఒత్తిళ్ల నుంచి ప్రేక్ష‌కులు రిలీఫ్ అయ్యేలాగా ఈ సినిమాను రూపొందించాం. త‌గిన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వ‌గ‌లిగితే 100 శాతం సినిమాలు హిట్ అవుతాయి. అదే కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాను నిర్మించాం.’

‘చాలా మంది బ‌య్య‌ర్లు అడుగుతున్నారు. కానీ మేం ఇంకా మార్కెట్ స్టార్ట్ చేయ‌లేదు. ఇంకా విడుద‌ల తేదీని మేం ఖ‌రారు చేయ‌లేదు కాబ‌ట్టి స్టార్ట్ చేయ‌లేదు. ఇప్పుడు మే 5 అనుకుంటున్నాం కాబ‌ట్టి ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తాం.’ అంటూ ముగించారు నిర్మాత గురురాజ్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.