మూడో రోజు ఆదుకున్న రెహానే, పూజారా

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముచ్చటగా ముగిసింది. సోమవారం ఆటముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా చేసిన పరుగులకంటే 126 పరుగుల లీడ్ సాధించింది.

అయితే ఒకానొక దశలో మొదటి ఇన్నింగ్స్ మాదిరిగానే కోహ్లీ సేన మళ్లీ క్యూ కట్టినట్టు అనిపించినప్పటికీ పుజారా, రహానే అద్భుతంగా ఆడి కాస్త ఊరట కలిపించారు. వీరిద్దరు కలిసి 203 బంతుల్లో 93 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఛతేశ్వర్ పుజారా 79, అజింక్యా రహానే 40 పరుగులతో క్రీజ్‌లో ఉండి పటిష్ట స్థితిలో ఉన్నారు. మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. దీంతో ఆసిస్‌కు భారీ టార్గెట్ ఇచ్చి మ్యాచ్ నెగ్గాలనేది కోహ్లీ సేన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఆస్ట్రేలియాతో మొదటి టెస్ట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ వికెట్ పడకుండా భారత ఆటగాళ్లు పూర్తి సెషన్ ఆడటం ఇదే మొదటిసారి.

 

మూడోరోజు ఆట ముగిసే సమయానికి స్కోర్:

ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ : 189/10

ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ : 276/10

ఇండియా సెకండ్ ఇన్నింగ్స్: 213/4(బ్యాటింగ్ కొనసాగుతోంది.)

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.