నేనేం స్టేట్‌మెంట్ ఇవ్వలేదు: పూరీ జగన్నాథ్

Puri Jagan tweets and clarifies on Drugs case issue

డ్రగ్స్ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పూరీ జగన్నాధ్. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చిందన్న ప్రచారం జరుగుతున్నప్పటి నుండి ఒకరి తర్వాత ఒకరు తమ వివరణలు ఇస్తున్నారు. అయితే ఇంత కీలక కేసులో తన పేరు బయటికి రావడంపై పూరీ జగన్నాథ్ స్పందన గురించి అందరూ ఎదరుచూస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ట్విట్టర్‌లో పూరీ గన్ అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక ప్రకటన విడుదల అయి పెద్ద దుమారమే రేపింది.

Puri Jagan tweets and clarifies on Drugs case issue

చాలా ఘాటుగా నాకు దమ్ముంది మరీ మీకు అంటూ ఒక ట్వీట్ రావడం, అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది.

వైరల్ అయిపోయిన ఈ పోస్ట్ తన ఇమేజ్‌కి డ్యామేజ్ చేస్తుందని గ్రహించిన పూరీజగన్నాథ్ ఎట్టకేలకు ట్విట్టర్ సాక్షిగా స్పందించారు.  ‘నేను ఏ విషయానికి సంబంధించి, ఎవరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నా సినిమా పైసావసూల్ ను పూర్తి చేసే పనిలో ఉన్నా’ అంటూ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా పైసా వసూల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి. డ్రగ్స్ కేసులో పూరితో పాటు ఆయన సన్నిహితులు రవితేజ, చార్మీ, సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడుల పేర్లు కూడా డ్రగ్స్‌ కేసులో బయటకు వచ్చాయి.

See Also: డర్టీ పిక్చర్ : డ్రగ్స్ కేసులో బయటపడుతున్నమేకప్

Have something to add? Share it in the comments

Your email address will not be published.