ఏప్రిల్‌లో `శివ‌లింగ’ భయపెడుతుందా?

Raghava Lawrence horror comedy Sivalinga pre release buzz releasing on April14th copy
Raghava Lawrence horror comedy Sivalinga pre release buzz releasing on April14th copy
ఇండస్ట్రీలో కొరియోగ్రాప‌ర్‌గా, ద‌ర్శ‌క‌హీరోగా త‌న‌దైన గుర్తింపుతో దూసుకెళ్తున్న రాఘ‌వ లారెన్స్ లేటెస్ట్ సినిమా ‘శివ‌లింగ’. సాలా ఖడూస్ ఫేం రితికా సింగ్ ఇందులో కథానాయిక పాత్రని పోషిస్తోండగా ‘చంద్ర‌ముఖి’ వంటి సంచ‌ల‌న చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ పి.వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన ‘శివ‌లింగ’ చిత్రాన్ని అదే టైటిల్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించారు. ఏప్రిల్ 14న అభిషేక్ ఫిలింస్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.ఈ సినిమాకు కథే మొదటి హీరో అంటున్న లారెన్స్ , గంగ కన్నా గొప్పగా ఈ చిత్రం ఉంటుందని లారెన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. .
చిత్ర నిర్మాత మాట్లాడుతూ“క‌థే హీరోగా కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన చిత్రమిది. పి.వాసు గారి ‘చంద్రముఖి’ ఎంత‌టి సెన్సేష‌నో తెలిసిందే. అలాగే లారెన్స్ ‘కాంచన’, ‘గంగ’ ఏ స్థాయిలో విజ‌యాలు సాధించాయో తెలుసు. వాటిని మించిన కథ, కథనాలతో హారర్ ఎంటర్ టైనర్‌గా ‘శివలింగ’ తెరకెక్కింది. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైల‌ర్‌, పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఏప్రిల్‌లో 14న అభిషేక్ ఫిలింస్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. హారర్‌ కాన్సెప్ట్ ల పరంగా ‘శివలింగ’ నెక్ట్స్ లెవెల్‌లో ఉండే చిత్రమ‌వుతుంది` అని తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.