ఐపీఎల్‌కు ద్ర‌విడ్ గుడ్‌బై

Rahul Dravid to say good bye to Indian Premier League

ఐపీఎల్‌‌తో త‌న బంధాన్ని పూర్తిగా తెంచుకోనున్నాడు రాహుల్ ద్ర‌ావిడ్‌. ఆట‌గాడిగా ఎప్పుడో రిటైరైనా.. ప్ర‌స్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మెంటార్‌గా ఉన్న ద్రావిడ్ అటు ఇండియా ఎ, అండ‌ర్ 19 టీమ్స్‌కు కోచ్‌గా ఉంటున్నాడు..

Rahul Dravid to say good bye to Indian Premier League

ఒకవైపు ఐపీఎల్‌తో ఒప్పందం, భారత టీంలకు కోచ్‌గా ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల కిందికే వ‌స్తుంద‌ని రామ‌చంద్ర గుహ ఆరోపించిన తర్వాత ద్ర‌విడ్ సీఓఏకు లేఖ కూడా రాశాడు.బీసీసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం తాను ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ‌లేద‌ని అత‌ను స్ప‌ష్టంచేశాడు. తన కాంట్రాక్ట్ మ‌ధ్య‌లో ఉన్న‌పుడు బోర్డు రూల్స్ మార్చిందేమో త‌న‌కు తెలియ‌ద‌ని, అలా చేస్తే అది బోర్డు త‌ప్ప‌వుతుంది కానీ త‌న‌ది కాద‌ని ద్ర‌విడ్ అన్నాడు.

See Also: వంట మనిషి ఇలా అయ్యాడేంటి??

ద్ర‌విడ్ గ‌తంలో 10 నెల‌ల కాలానికి బీసీసీఐ నుంచి రూ.4 కోట్లు వ‌సూలు చేశాడు. అటు ఢిల్లీ టీమ్ కూడా అంతే మొత్తం ద్ర‌విడ్‌కు ఇచ్చింది. ఇప్పుడు ఆ ప‌ద‌విని వ‌దులుకోనుండ‌టంతో ద్ర‌విడ్ కాస్త ఎక్కువ మొత్తాన్నే కోచ్ ప‌ద‌వికి డిమాండ్ చేయ‌నున్నాడు. తాము భ‌రించ‌గ‌లిగినంత మొత్తాన్నే ద్ర‌విడ్ డిమాండ్ చేస్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది. అటు ఐపీఎల్ కాంట్రాక్ట్ పోనుండ‌టంతో ఆ మేర‌కు అత‌నికి న‌ష్టం క‌ల‌గ‌కుండా కూడా చూస్తామ‌ని బోర్డు స్ప‌ష్టంచేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.