పరిస్థితిని చక్కదిద్దుతున్న రాహుల్‌గాంధీ

Rahul Gandhi settling the differences between Congress and Nitish Kumar

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిత్రపక్షాల్లో ఉన్న విబేధాలను పక్కనబెట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రంగంలోకి  దిగారు. గత కొన్నినెలలుగా కాంగ్రెస్ పార్టీ దోస్తీని పక్కనబెట్టిదూరం దూరంగా ఉంటూ మధ్య మధ్యలో విమర్శలు చేస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ ‌కుమార్‌ను దారిలోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు రాహుల్.

Rahul Gandhi settleing the differences between Congress and Nitish Kumar JDU

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌కు నితీశ్‌ మద్దతు ఇవ్వనని చెప్పడం, కొన్ని రోజులుగా కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌- జేడీయూ మధ్య సంబంధాలు బెడిసికొడుతున్నట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌, నితీశ్‌ మధ్య ఇటీవల కాలంలో విభేదాలు పొడచూపిన నేపథ్యంలో దాన్ని చక్కదిద్దేందుకు వీరిద్దరి మధ్య ఈ భేటీ జరగుతోన్నట్లు సమాచారం. ఇటువంటి సమయంలో  రాహుల్‌, నితీశ్‌తో వ్యక్తిగతంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బీహార్‌ ప్రభుత్వంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమిగా ఉన్నాయి. తాజా పరిస్థితుల కారణంగా జేడీయూ కాంగ్రెస్‌తో విడిపోయి బిజెపితో చేతులు కలిపే అవకాశముందని టాక్ ఎక్కువైంది.అంతేగాక నితీశ్‌ కాంగ్రెస్‌పై చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ‘ ప్రతిపక్షంలోని మిగతా పార్టీలతో కాంగ్రెస్‌కు సంబంధాలు బలహీనంగా ఉన్నాయి.

See Also: ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్ షురూ

ప్రతిపక్ష పార్టీల మధ్య ఐకమత్యం ఒక్కటే ఉంటే సరిపోదు. భాజపా తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయ మార్గం ఉండాలి. అంతేగానీ.. కేవలం స్పందిస్తామంటే మాత్రం అది పనిచేయదు. కూటములను కాంగ్రెస్‌ అసమర్థంగా నిర్వహిస్తోందని, అందుకు అసోం ఎన్నికలు, రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయమే ఉదాహరణ’ అని నితీశ్‌ ఘాటుగా స్పందించారు.

అంతేగాక జులై 11న విపక్షాలు సమావేశమై ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమావేశానికి గైర్హాజరు అయిన బీహార్‌ సీఎం నితీశ్‌ రాహుల్‌తో భేటీ అయిన తర్వాత అయినా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్‌తో కలిసి వస్తారా.. లేదా అనే అంశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు

Have something to add? Share it in the comments

Your email address will not be published.