మన ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు??

Rahul Gandhi Tweets on PM Modi in China sikkim issue
సిక్కిం సెక్టార్‌లో రోడ్డు నిర్మాణం విషయమై భారత సైనికులతో ఘర్షణ మొదలైన రోజునుంచి సిక్కింను భారత్‌ నుంచి విభజించి.. స్వతంత్ర దేశాన్ని చేయాలంటూ చైనా అధికారిక మీడియా పిచ్చి రాతలు రాస్తూనే ఉంది. చైనా సరిహద్దుల్లో ఉన్న సిక్కిం రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమానికి తెరలేపాలని రాతలు రాస్తోంది. అంతేగాక సిక్కింను భారత్‌ క్రూరంగా తన దేశంలో కలుపుకున్నదని, సిక్కింపై చైనా తన వైఖరిని మార్చుకొని.. ఇప్పుడు స్వాతంత్ర్య సిక్కిం డిమాండ్‌కు అండగా నిలువాలని సూచించింది.
Rahul Gandhi Tweets on PM Modi in China sikkim issue
ఇలాంటివి జరుగుతున్నప్పటికీ చైనా విషయంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా ప్రధాని మౌనం వహించడం తప్పుబడుతూ రాహుల్‌‌గాంధీ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఇప్పటికే చైనా సైనిక దళం టిబెట్లోని ఎత్తైన ప్రాంతాల్లో యుద్దంలో ఎదురయ్యే పరిస్ధితులను కృత్రిమంగా సృష్టించుకుని కసరత్తులు చేస్తోంది. అంతేగాక సిక్కింలో భారత్‌తో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది.

See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు

ఇలాంటి ఉద్రిక్తపరిస్థితులు తొలిగిపోయేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని మోడీని డిమాండ్‌ చేస్తోంది.

See Also: లాలూకి తప్పని సీబీఐ దాడులు

Have something to add? Share it in the comments

Your email address will not be published.