ఆకట్టుకుంటున్న అంధగాడు ట్రైలర్

Raj Tharun Hebah Patel Andhagadu trailer getting good response

Raj Tharun Hebah Patel Andhagadu trailer getting good response

చిన్న సినిమాలతో పెద్ద హీరోగా మారిన వండర్ హీరో రాజ్‌తరుణ్ లేటెస్ట్ సినిమా అంధగాడు. వెలింగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో,  ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

యంగ్ హీరో రాజ్ తరుణ్, గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలలో తెర‌కెక్కుతున్న‌ అంధగాడు మూవీ ట్రైల‌ర్ ఈరోజు విడుద‌లైంది. ఇందులో రాజ్ త‌రుణ్ అంధుడిగా క‌నిపిస్తుండ‌గా, హెబ్బా పటేల్ కీలక పాత్రలో కనిపించనుంది.

శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఒక్కొక్కటి చొప్పున ఆన్‌లైన్లో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్న టీం త్వ‌ర‌లో ఆడియో వేడుక జ‌రిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్టర్స్ కి, టీజర్ కి, ఆడియోకి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేందుకు ట్రైలర్ ఉపయోగపడనుంది.

రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ కాంబినేషన్ లో వచ్చిన కుమారి 21 ఎఫ్, ఈడో రకం ఆడోరకం చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్ హ్యట్రిక్ పై కన్నేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.