‘నంది’ని ఎగురేసుకెళ్ళిన ‘ఈగ’

rajamouli-eega-bags-2012-best-film-nandi-award

rajamouli-eega-bags-2012-best-film-nandi-award

ఐదేళ్ళక్రితం తెలుగు సినీ పరిశ్రమలో ఓ ఈగ దుమారాన్ని లేపింది. ఎంతగానంటే అప్పటినుండి ఇప్పటివరకు ఎక్కడ ఈగ కనిపించినా జనాలకు మొదటగా ఈగ చేసిన అల్లరే సినిమానే గుర్తుకువచ్చేట్లు మనస్సుల్లో అంతలా చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి ఈగ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత హీరోహీరోయిన్లుగా 2012లో విడుదలై బంపర్ హిట్ అయిన ఈగ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012 సంవత్సరానికిగాను ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును ప్రకటించింది.

సినీ రంగానికి ప్రతీ యేడాది ఇచ్చే నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2012 –13 రెండు సంవత్సరాలకుగాను అవార్డుల నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అందించారు. 2012 సంవత్సర కమిటీకి జయసుధ, 2013 సంవత్సర కమిటీకి కోడి రామకృష్ణ ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు.

2012 నంది అవార్డుల వివరాలు 

 • ఉత్తమ చిత్రం: ఈగ
 • రెండో ఉత్తమ చిత్రం- మిణుగురులు
 • మూడో ఉత్తమ చిత్రం- మిథునం
 •  ఉత్తమ కథానాయకుడు- నాని(ఎటో వెళ్లిపోయింది మనసు)
 • ఉత్తమ కథానాయిక- సమంత(ఎటో వెళ్లిపోయింది మనసు)
 • ఉత్తమ దర్శకుడు- ఎస్‌.ఎస్‌.రాజమౌళి(ఈగ)
 • ఉత్తమ విలన్ : సుదీప్ (ఈగ)
 • ఉత్తమ సహాయనటుడు- అజయ్‌(ఇష్క్‌)
 • ఉత్తమ సహాయనటి- శ్యామల(వీరంగం)
 • బెస్ట్‌ పాపులర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌- జులాయి
 • ఉత్తమ గాయకుడు- శంకర్‌ మహాదేవన్‌
 • ఉత్తమ గాయని- గీతామాధురి
 • ఉత్తమ సంగీత దర్శకుడు :  కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
 • ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ల భరణి (మిథునం)
 • ఉత్తమ గేయ రచయిత : అనంత్ శ్రీరామ్ (ఎటో వెళ్లిపోయింది మనసు)
 • ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
 • ఉత్తమ ఫైట్స్ : గణేష్ ( ఒక్కడినే)
 • ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : ఆర్ సీ యం రాజు (మిణుగురులు)
 • ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ : శిల్ప (వీరంగం)
 • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఈగ
 • ఎస్వీ రంగారావు పురస్కారం : ఆశిష్ విద్యార్థి

Have something to add? Share it in the comments

Your email address will not be published.