దటీజ్ రాజాసింగ్

Rajasingh decided to sit infront of Pragathi bhavan for problems solution as CM KCR OSD blocked his number

Rajasingh decided to sit infront of Pragathi bhavan for problems solution as CM KCR OSD blocked his number

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఎమ్మెల్యే అయినప్పటినుండి నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడానికి ఎప్పుడూ ముందుటారు. అలాంటి రాజాసింగ్ తెలంగాణా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. గోషామహల్ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని సంప్రదించడానికి ప్రయత్నిస్తుంటే సీఎం కెసిఆర్ ఓఎస్డీ తన ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసి విషయాన్ని సీఎం ద‌ృష్టికి తీసుకెళ్ళట్లేదని ఆరోపించారు. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు.

గోషామహల్ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి కెసీఆర్ తెలుసుకొనేవరకు తన ఆఫీస్ అడ్రస్‌‌ను ప్రగతిభవన్ రోడ్డుమీదికే మార్చానని అంటున్నారు. ప్రతీరోజు ఉదయం 10గంటల నుండి రాత్రి 10 గంటలదాకా ప్రగతిభవన్ రోడ్డుమీదే కూర్చొని నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటానని స్పష్టంచేశారు. ధూల్‌పేటలో ఇప్పటికే మూడువేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇప్పటికైనా ధూల్‌పేట ప్రజల సమస్యలను తీర్చాలని సీఎంను డిమాండ్ చేశారు రాజాసింగ్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.