నేను పక్కా తమిళుడినే

Rajinikanth continues the guessing game of joining politics and reiterated on Pakka Tamilian issue

Rajinikanth continues the guessing game of joining politics and reiterated on Pakka Tamilian issue

ఐదు రోజులుగా అభిమానులతో సమావేశమౌతున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ తన చివరిరోజు సమావేశంలొో కాస్త ఉద్వేగంగా మాట్లాడారు. తనను పూర్తిగా తమిళుడిగా మార్చింది అభిమానులేనని, కర్ణాటక నుంచి వచ్చిన తనను తమిళుడిగా మార్చి గొప్పగా స్వాగతం పలికారని గుర్తుచేసుకున్నారు. తాను కర్ణాటకలో 23 సంవత్సరాలు జీవించానని, అలాగే తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నానన్న రజినీకాంత్ ఇన్నేళ్ళలో తనని నిజమైన తమిళుడిగా మార్చారని స్పష్టంచేశారు.

తాను పక్కా తమిళుడినే అన్న రజినీకాంత్ తాను ఏం మాట్లాడినా మీడియా తనను తరుముతోందని, సంచలనం చేస్తోందని, ఇందుకు రాజకీయాలే కారణం అని అన్నారు. తాను ఎంతో క్రమ శిక్షణతో ఉండటం వల్లే ఇలా ఉన్నానని చెప్పిన రజినీ ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చినప్పుడు తన గొంతు వినిపిస్తానని స్పష్టంచేశారు. అవందరిలాగే తనకు కూడా కొన్ని పనులు, బాధ్యతలు ఉన్నయన్న రజినీ, రాజకీయాల్లో తప్పనిసరి పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు అందరం కలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. అంతేగాక సరైన సమయం వచ్చినప్పుడు అభిమానం చూపించడానకి సిద్ధంగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయి ఉంది. దానిని ప్రక్షాళన చేయాల్సి ఉంది’ అని ఆయన చెప్పారు. తనను తమిళనాడు నుంచి వెళ్లిపొమ్మంటున్నారని, అలా వెళ్లిపోయే ప్రసక్తి లేదని రజినీకాంత్‌ చెప్పారు. అంతేగాక ప్రజాస్వామ్యం భ్రష్టుపడిపోయింది. వ్యవస్ధ మారాలి. ప్రజల ఆలోచనల్లోంచి మార్పు రావాలి. అప్పుడే దేశం సరైన మార్గంలో ముందు కెళుతోందన్న రజినీ రాజకీయాల్లో ఎంతోమంది సీనియర్‌ నాయకులు ఉన్నారని, జాతీయ పార్టీలు కూడా ఉన్నాయని, కానీ వ్యవస్థ చెత్తగా మారినప్పుడు మనమేం చేస్తున్నాం అని గుర్తుంచుకోవాలని అభిమానులకు సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.