ఆ రెండిటి వల్ల చాలా బాధలు అనుభవించా: రజినీకాంత్

Rajinikanth meets fans makes statement Will Join Politics If God Wants Me To

Rajinikanth meets fans makes statement Will Join Politics If God Wants Me To

ఎంతోకాలంగా అభిమానుల మధ్య నలుగుతున్న ఓ అంశం గురించి స్పష్టత ఇచ్చారు తలైవా రజినీకాంత్. కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తారని, రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో తన మనసులో మాటను బయటపెట్టారు రజినీకాంత్. త‌న‌కు రాజకీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని, అయితే అది దేవుడి ఆజ్ఞ అయితే మాత్రం తాను క‌చ్చితంగా ఆ దిశ‌గా ఆలోచిస్తాన‌ని రజినీకాంత్ స్పష్టంచేశారు. చెన్నైలో అభిమానుల‌తో  ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌ైన రజినీకాంత్ ఇరవై ఏళ్ళ క్రితం కొంత‌కాలం తాను రాజ‌కీయాల్లో ఉన్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ గుర్తుచేసుకున్నారు. అదొక పొలిటిక‌ల్ యాక్సిడెంట్‌గా అభివ‌ర్ణించిన రజినీ 1996లో జ‌య‌ల‌లితకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయడంతో ఆ ఎన్నిక‌ల్లో జ‌యలలిత ఓడిపోయారు. అయితే 21 ఏళ్ల క్రితం ఓ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికి త‌ప్పు చేశానని బాధపడ్డారు రజినీకాంత్.అదొక పొలిటిక‌ల్ యాక్సిడెంట్‌ అని అప్ప‌టి నుంచి చాలా మంది నేత‌లు తన పేరును త‌ప్పుగా వాడుకుంటూనే ఉన్నారని స్పష్టంచేశారు రజినీకాంత్.

అయితే దేవుడి ఆజ్ఞ అయితే మాత్రం రాజకీయాల్లోకి వస్తానని, ఒక‌వేళ రాజ‌కీయాల్లోకి వ‌స్తే మాత్రం నిజాయ‌తీగా ప‌నిచేస్తాన‌ని, డబ్బు కోసమే ప‌నిచేసేవాడిని ద‌గ్గ‌రికి కూడా రానివ్వ‌న‌ని ర‌జ‌నీ స్పష్టంచేశారు. మ‌న జీవితంలో ఏం చేయాలో దేవుడే నిర్ణ‌యిస్తాడని, ప్ర‌స్తుతానికి దేవుడు న‌న్ను ఓ న‌టుడిగా ఉండాల‌నుకున్నారు అందుకే తన బాధ్య‌త‌ను తాను నెర‌వేరుస్తున్నానని చెప్పుకొచ్చారు.

అంతేగాక ప్రతిఒక్కరూ మందు, సిగ‌రెట్‌ల‌కు దూరంగా ఉండాల‌ని త‌న అభిమానుల‌కు ర‌జనీకాంత్ సూచించారు. తాను వీటి వ‌ల్ల చాలా బాధ‌లు అనుభ‌వించాన‌ని అత‌ను చెప్పుకొచ్చారు. అభిమానులు నిజాయితీగా జీవించాలని తాను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదని, తన అభిమానులు సైతం ఏపార్టీకి సపోర్ట్ చేయొద్దని చెప్పుకొచ్చారు రజినీకాంత్.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.