22ఏళ్ళ తర్వాత మళ్ళీ తెరకెక్కిన బాషా

సినిమా ఎలా ఉన్నా తొలిరోజున రికార్డుల అంతు చూడ్డం.. కొత్త రికార్డులు క్రియేట్ చేయడం సూపర్ స్టార్ రజినీకాంత్ కి కొత్తేమీ కాదు. రీసెంట్ గా కబాలి ఎన్నేసి సెన్సేషన్స్ సృష్టించిందో చూశాం. ఇప్పుడు రజినీ నటించిన ఆల్ టైం ఫేవరేట్ మూవీ బాషా.. మళ్లీ రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్స్లో సందడి చేస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత ఈ మూవీ మళ్ళీ థియేటర్స్ లోకి రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

రజనీకాంత్ ఇమేజ్ ను, క్రేజ్ ను మరింత పెంచిన సినిమా బాషా. ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు అనే డైలాగ్ ఇప్పటికి అందరికి గుర్తు ఉండే ఉంటుంది. బాషా మూవీలో రజనీకాంత్ రెండు కేరక్టర్స్ వేశాడు. ఒక పాత్ర లో మాఫియా డాన్ గా కనిపించగా, రెండో పాత్రలో మామూలు ఆటో డ్రైవర్ గా కనిపించాడు. ఈ రెండు కేరక్టర్స్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి రజనీకాంత్ సూపర్బ్ అనిపించుకున్నాడు. ఇప్పుడీ సినిమాను డిజిటలైజ్డ్ రీమాస్టర్డ్ వెర్షన్ లో రిలీజ్ చేశారు.

డిజిటల్ వెర్షన్ బాషాను మార్చి 3న బాక్సాఫీస్ దగ్గర దించేశారు. 22 ఏళ్ల తర్వాత మళ్లీ రిలీజ్ అయినా సరే.. ఈ మూవీకి క్రేజ్ చూస్తే.. రజినీ స్టామినా ఏంటో అర్ధమవుతుంది. మల్టీప్లెక్సులతో సహా దాదాపు అన్ని థియేటర్లలోనూ డిజిటల్ బాషా దిగిపోయాడు. అంచనాలకు మించిన కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు.

చూస్తుంటే.. కలెక్షన్స్ లో అప్పటి బాషా రికార్డులతో పాటు రీసెంట్ రికార్డులు కూడా చాలావరకూ మాయం అయిపోయేట్లుగా ఉన్నాయి. సెకండ్ రిలీజ్ లో ఈ మూవీకి జనాల నుంచి వస్తున్న ఆదరణ చూసి.. ట్రేడ్ జనాలు షాక్ అవుతున్న పరిస్థితి. ఏకంగా ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించారంటే.. బాషా బజ్ ఏంటో అర్ధమవుతుంది. మరి ఈ డిజిటల్ బాషా ఎన్నేసి రికార్డులను బద్దలు కొడతాడో.. మరెన్ని సృష్టించబోతున్నాడో చూడాలి. బాషా చిత్రం సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కగా ఈ చిత్రం అప్పట్లో విజయవంతంగా 368 రోజులు నడిచింది. భారీ వసూళ్ళతో మాసివ్ హిట్ గా
నిలిచింది . 2012లో డిజిటల్ గా రీస్టోర్ అయిన ఈ చిత్రం హిందీలో ను విడుదలై అంచనాలు తలక్రిందులు చేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.