చెర్రీ రాముడైతే..?

Ram Charan as Sri Rama in Ramayan Movie fan made posters creat buzz in social media

Ram Charan as Sri Rama in Ramayan Movie fan made posters creat buzz in social media

మెగాస్టార్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్న హీరో రామ్‌ చరణ్. తండ్రి మెగాస్టార్ అయినప్పటికీ ఎక్కడా తన శ్రమ తగ్గకుండా ముందుకు దూసుకెళ్తూ విజయాలను అందుకోవడేకాకుండా ఇండస్ట్రీలో తన పేరుకు డ్యామేజ్ కాకుండా వ్యవహరిస్తున్నాడు చెర్రీ.

గతేడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ధృవ సినిమాకోసం టోన్డ్ బాడీని తయారుచేసుకున్నప్పుడు చెర్రీని చూసి చాలామంది భిన్న కథలతో అతన్ని అప్రోచ్ అయ్యారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సమంత హీరోయిన్‌గా ప్రాజెక్ట్ ఒకటి పట్టాలపై ఉంది. ఇదే సమయంలో లేటెస్ట్‌గా బాహుబలి సినిమా కలెక్షన్లను చూసి హై బడ్జెట్ మూవీలకు తెరలేస్తోంది.

మొన్న దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త మోహన్‌లాల్ ప్రధానపాత్రలో మహాభారతం సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తెలుగు నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాతలు ఇద్దరితో కలిపి 500కోట్ల బడ్జెట్‌తో రామాయణం సినిమాని ప్రకటించారు. సినిమా  అని ప్రకటించిన వెంటనే మెగా అభిమానులు తమ క్రియేటివిటీకి పదును పెట్టి చెర్రీని రాముడి పాత్రలో ఫిక్స్ చేస్తూ సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్టర్లు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. అద్భుతమైన డిజైన్‌తో ఉన్న పోస్టర్లు నిజంగానే అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి 101వ సినిమా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి డిజైన్ ఇప్పటికే సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంటే తాజాగా చెర్రీ పోస్టర్లు ఫుల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాముడిగా రామ్‌చరణ్ పోస్టర్‌ను విడుదల చేసిన ఫ్యాన్స్ తమ క్రియేటివిటీతో ఎవరికే పాత్రను ఇస్తారో ఎలాంటి డిజైన్లను చూపిస్తారో ఎదురుచూడాల్సిందే…

Have something to add? Share it in the comments

Your email address will not be published.