రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా దర్శకుడు ఆడియో వేడుక

Ram Charan will be the Chief Guest for Sukumar Darshakudu Movie

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Ram Charan will be the Chief Guest for Sukumar Darshakudu Movie

అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నెల 15న జరుగనున్న ఈ చిత్ర పాటల వేడుకకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

See Also: సంక్రాంతి కానుక‌గా రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్‌ల చిత్రం “రంగస్థలం 1985”

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ చేతుల మీదుగా ఈ పాటలను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆయన చేతుల మీదుగా మా పాటలు విడుదలకానుండటం మాకెంతో ఆనందంగా వుంది అని తెలిపారు. అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.

Have something to add? Share it in the comments

Your email address will not be published.