రాష్ట్రపతి అభ్యర్ధిగా రామనాథ్ కోవింద్

Ram Nath Kovind: NDA’s Presidential Candidate

 

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నాయకుడి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్‌ గవర్నర్‌ రామనాథ్‌ కోవింద్‌ పేరు ఖరారు చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో కోవింద్‌ పేరును ప్రకటించారు.

Ram Nath Kovind: NDA’s Presidential Candidate

దళిత నాయకుడైన రామనాథ్‌ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఉన్న డేరాపూర్‌‌. 1945, అక్టోబర్‌ 1న జన్మించిన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. 1994-2006 మధ్య కాలంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2015 నుంచి బిహార్‌ గవర్నర్‌గా ఉన్నారు. గతంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.