‘బాబ్రీ కేసు’లో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Ramjanmabhoomi-Babri Masjid dispute SC for concluding joint trial against Advani and other top BJP leaders

Ramjanmabhoomi-Babri Masjid dispute SC for concluding joint trial against Advani and other top BJP leaders

బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొటున్న కేసులో దోషులను మళ్ళీ విచారించేందుకు అనుమతించాంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం తీర్పును రిజర్వ్ చేసింది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత నేత ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి సహా సీనియర్ నేతలపై కుట్ర ఆరోపణలు తిరిగి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందా లేదా అనే సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి అద్వానీ సహా 13 మంది బీజేపీ నేతలపై కుట్ర అభియోగాలను ప్రత్యేక కోర్టు కొట్టేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును అలహాబాద్‌ హైకోర్టు సైతం సమర్థించింది. అయితే ఈ క్రమంలో సీబీఐ ఈ కేసును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అయితే అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేసుకొనేందుకు రెండువారాల గడువు విధించింది.

ఆ తర్వాత ఈరోజు విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు ముందు సీబీఐ తన వాదనలు వినిపించింది. 14 మంది భాజపా నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సిందేనని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే కేవలం సాంకేతిక కారణాలతో 13 మంది బీజేపీ నేతలపై ఉన్న కేసులు తొలగించేందుకు అంగీకరించబోమని, అవసరమైతే కుట్ర ఆరోపణలపై వారు తిరిగి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన  నేపథ్యంలో ఈ రోజు విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.