ఎన్డీఎ అభ్యర్థి నామినేషన్ దాఖలు

RamNath kovind files the nomination papers for NDA Presidential Candidature

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవనంలో రాజకీయ ఉద్దండుల సమక్షంలో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.

RamNath kovind files the nomination papers for NDA Presidential Candidature

రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, అమిత్‌షా, మురళీమనోహర్‌ జోషీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, నితిన్‌గడ్కరీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు. అంతేగాక ఎన్డీయే, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. రామ్‌నాథ్ మొత్తం నాలుగు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయగా.. ఆయనను ప్రతిపాదిస్తూ తొలి నామినేషన్‌ పత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ, రెండో పత్రంపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, మూడో నామినేషన్‌ పత్రంపై అమిత్‌షా, నాలుగో పత్రంపై అకాళీదళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ సంతకాలు చేసారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు రామ్‌నాథ్ కోవింద్. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్‌నాథ్ దేశ అత్యున్నత పదవికి మరింత వన్నె తెచ్చేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని పలు విపక్షాలు తమ అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి ఎన్నిక కాస్త రసవత్తరంగా మారింది. అంతేగాక రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. ఇదిలా ఉంటే ఈ నెల 27 లేదా 28 తేదీల్లో మీరాకుమార్ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.