రెజీనాపై కన్నేసిన రానా

ఒక మూవీ సక్సెస్ అయితే మరో మూవీకి ప్లాన్ చేసుకుని రెడీ అవుతారు. అదే ఒక ఫ్లాప్ ఎదురైతే బండి స్లో అవుతుంది. ఈమధ్య టాలీవుడ్ లో హీరోలు ఎక్కువగా సక్సెస్ లు కొడుతున్నారు. హీరో రానా కూడా ఇప్పుడు బంపర్ సక్సెస్ కొట్టి మాంఛి జోరు మీద ఉన్నాడు. దాంతో మరో పిక్చర్ కు ఇమ్మీడియట్ గా సిద్ధమవుతున్నాడు.

ఒక సినిమా విజయం ఆ పిక్చర్లో పనిచేసిన వారందరికీ కొండంత ఉత్సాహాన్నిస్తుంది. నటీనటులతోపాటు టెక్నీషియన్స్ కు కూడా మంచి ప్రేరణ అవుతుంది. ఇంక హీరో, హీరోయిన్స్ కైతే చెప్పక్కర్లేదు. లేటెస్ట్ గా ఘాజీ ఘనవిజయం  హీరో  రానాకు అంతులేని ఎంకరేజ్ మెంట్ ఇచ్చింది. అంతే. మరో పిక్చర్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. దాన్ని తెలుగు, తమిళ భాషల్లో చేయడానికి ప్రిపేర్ అయిపోయాడు.

రానా చేయబోయే మూవీ స్టోరీ కూడా విలక్షణంగా ఉంటుందట. మామూలుగా ఇప్పటి టైమ్ కు తగ్గ కథలతోనే సినిమాలు వస్తున్నాయి. అడపా, దడపా వెరైటీ స్టోరీస్ మనం చూస్తుంటాం. రానా యాక్ట్ చేయబోయే సినిమా స్టోరీ స్వాతంత్ర్యానికి పూర్వపు నాటి కథ. దీనికి తమిళ దర్శకుడు సత్యశివ దర్శకత్వం వహిస్తాడు. గతంలో ‘కళగు’ అనే  వెరైటీ చిత్రాన్ని రూపొందించిన సత్యశివ చెప్పిన కథ రానాకు బాగా నచ్చింది.

ఈ రోజుల్లో సినిమా మేకింగ్ హీరో ఇష్టాఇష్టాల మీద, అతనికి కథ నచ్చడంమీద  ఆధారపడి ఉంది. సో .. .. రానాకు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

భారత స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనలతో ఈ చిత్ర కథ సాగుతుందట. భారీ వ్యయంతో రూపొందే ఈ పిరియడ్ మూవీలో నటించేందుకు రెజీనాకు ఛాన్స్ వచ్చిందని లేటెస్ట్ న్యూస్. రెజీనా ఈమధ్య  తెలుగులో అంతగా కనిపించనప్పటికీ తమిళంలో మాత్రం ఫుల్ బిజీ.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.