రాణీముఖర్జీ రీఎంట్రీ

Rani Mukerji To Make Comeback With Hichki

ఈమెది బొంగురు గొంతు అయినా యూత్ కి వినసొంపుగానే వుంటుంది. చామన ఛాయ రంగు అయినా యువత కళ్ళు మాత్రం ఆమెవైపు నుండి తిప్పలేరు. బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి యువకుల గుండెలు కొల్లగొట్టి , ఏడు ఫిలిం ఫేర్ అవార్డులను ఎగురేసుకెళ్ళి ఒక్కసారిగా వెండితెరకు దూరమైంది.ఇప్పుడు ఆ అందాల తార మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి రీఎంట్రీ ఇవ్వనుంది.ఇంతకీ ఎవరా తార,ఏంటా కథ తెలుసుకోవాలనుకుంటన్నారా?

Rani Mukerji To Make Comeback With Hichki

బాలీవుడ్ లో ఒక ఊపు ఊపింది రాణీముఖర్జి. ఇప్పటికే ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 2014లో ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్న రాణీ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2015లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది.ఇప్పుడు ఈ అందాల తార బాలీవుడ్‌ బ్యూటీ రాణీ ముఖర్జీ రీ–ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ‘హిచ్‌కీ’ సినిమాతో ఆమె రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతుంది.

సిద్ధార్థ్‌ పి.మల్హోత్రా దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై మనీష్‌ శర్మ నిర్మించనున్న హిచ్ కీ చిత్రంలో రాణీ ప్రధాన పాత్ర పోషించనుంది. తన బలహీనతలను ఓ మహిళ బలంగా ఎలా మార్చుకుంది? అన్నదే కథాంశం. ‘‘పాజిటివ్‌ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చా’ అంటుంది రాణీ ముఖర్జీ.చాలా కాలంగా సినిమాలకు దూరంగా వున్న రాణీ ముఖర్జీ మంచి కథతో అభిమానుల ముందుకు రాబోతుండటంతో అభిమానులు హ్యాపీ గా వున్నారు.

సినిమాల్లో నటించడమే కాక, రాణీ మంచి దాతగానూ పేరొందారు. స్త్రీలు, చిన్నారులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారిపై చూపుతున్న వివక్ష గురించి ఆమె ఎన్నోసార్లు మాట్లాడింది. ఆమె ఎన్నో టూర్లలో కచేరీల్లోనూ, స్టేజ్ షోలలోనూ పెర్ఫార్మ్ చేసింది. 2009లో డాన్స్ ప్రీమియర్ లీగ్ కు న్యాయనిర్ణేతగా కూడా భాధ్యతలు నిర్వర్తించింది. దీంతో ఎంతో గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనపడనున్న రాణీముఖర్జీకి స్వాగతం పలుకుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.