పంతం నెగ్గించుకున్న రవిశాస్త్రి

Ravi shastri gets his way, Bharat Arun as bowling coach to join team India

గంగూలీ, రవిశాస్త్రిల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న అంతర్గత యుద్ధంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి తన పంతం నెగ్గించుకున్నారు. ఇటీవల బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లు నియమించబడ్డ ద్రవిడ్, జహీర్‌లకు నియామకం మూన్నాళ్ల ముచ్చటగానే అయ్యింది.

Ravi shastri gets his way, Bharat Arun as bowling coach to join team India

టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కోరుకునట్లే అసిస్టెంట్ కోచ్‌గా సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్‌గా భరత్‌అరుణ్‌లను నియమిస్తూ బీసీసీఐనిర్ణయం తీసుకుంది. 2019 వన్డే ప్రపంచకప్‌ వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న సంజయ్‌ బంగర్‌ను సహాయక కోచ్‌గా నియమించింది. ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ ఒప్పందాన్ని పొడగించింది.

See Also: పంతం నెగ్గించుకున్న కోహ్లీ

రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా ఉన్నప్పుడే భరత్‌ అరుణ్‌  బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. కుంబ్లే కోచ్‌ కావడంతో వీరిద్దరూ ఒకేసారి భారత జట్టును వీడారు. అంతేగాక అండర్‌-19 ఆడుతున్నప్పటి నుండి శాస్త్రి, అరుణ్‌ అత్యంత సన్నిహితులు. అయితే సచిన్,గంగూలీ,లక్ష్మణ్‌లతో ఏర్పాటుచేసిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌లను రవిశాస్త్రికి సహాయకులుగా నియమించింది. దీనిపై రవిశాస్త్రి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పెద్దగా అనుభవం లేని జహీర్ ఖాన్ వద్దంటూ పట్టుబట్టాడు. అదే సమయంలో వినోద్ రాయ్ నేతృత్వంలోని సీవోఏ కూడా ద్రవిడ్, జహీర్ ల ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ప్రధాన కోచ్ బాధ్యతను సీఏసీకి అప్పచెబితే, మరో ఇద్దర్ని తెరపైకి తీసుకురావడాన్ని తప్పుబట్టింది.

See Also: టార్గెట్ వెంకయ్యనాయుడు: ఏపీలో ఇక వికసించే కమలాన్ని అడ్డుకొనేదెవరు??

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.