కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుపై దాడికి యత్నం

ravindra-gaikwad-row-shiv-sena-mps-threaten-ashok-gajapathi-raju-in-parliament

ravindra-gaikwad-row-shiv-sena-mps-threaten-ashok-gajapathi-raju-in-parliament

పార్లమెంట్ సాక్షిగా శివసేన ఎంపీలు రౌడీసైనికులుగా మారి విధ్వంసం సృష్టించారు. ఎయిర్‌ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టి చిక్కుల్లో పడ్డ  శివసేన ఎంపీ గైక్వాడ్‌పై విమానయాన సంస్థలు నిషేధం విధించిన తర్వాత ఈరోజు అదే విషయంపై చర్చ జరిగింది. మొదట ఎంపీ గైక్వాడ్ మాట్లాడిన తర్వాత కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతుండగా గందరగోళానికి తెరలేసింది.

అశోక్‌గజపతిరాజు సమాధానంతో సంత‌ృప్తి చెందని  శివసేన ఎంపీలు మంత్రి అనంతగీతే సహా అందరూ సభ వాయిదావేసిన వెంటనే  అశోక్‌గజపతిరాజును చుట్టుముట్టి చాలా దురుసుగా ప్రయత్నించి ఆయనపై దాడికి యత్నించారు. వివాదం ముదురుతుండడంతో టీడీపీ ఎంపీలు అశోక్‌గజపతిరాజుకి రక్షణగా నిలబడగా, కేంద్రమంత్రి అనంతగీతేను మంత్రులు స్మృతీఇరానీ, ఆహ్లూవాలియాలు పక్కకితీసుకెళ్ళారు.

అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర హోంశాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అశోక్‌గజపతిరాజు వద్దకు చేరుకొని ఆయన్ను అక్కడినుండి తీసుకెళ్ళారు. ఆ తర్వాత సభలో జరిగిన ఘటనపై స్పీకర్ సుమిత్రా మహాజన్‌, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో అశోక్‌గజపతిరాజు భేటీ అయ్యారు.

 

ప్రత్యేక విమానంలో పార్లమెంట్‌కు వచ్చినా పేదోడేనట:

ఈ రోజు పార్లమెంట్‌లో గైక్వాడ్ ఎయిరిండియా వివాదానికి సంబంధించి చర్చ కారణంగా నిన్న ముంబై నుండి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వచ్చిన శివసేన ఎంపీ గైక్వాడ్ తాను చాలా పేదవాడినని విమానం కొనుక్కొనే స్థోమతలేదని మీడియాకు చెప్పుకొచ్చారు. ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన తర్వాత విమానయానసంస్థలు ఆయనపై  నిషేదాన్ని విధించాయి.

ఈ విషయం తర్వాత విమానంలో ప్రయాణించడానికి ఇప్పటికే మూడుసార్లు పేరు మార్చుకున్న గైక్వాడ్కు ఎలాంటి ఊరడింపు దొరకలేదు.  అయితే ఘటనకు సంబంధించి సభకు తన వాదన వినిపించారు ఎంపీ గైక్వాడ్. ఓ ఎంపీగా తాను అలా ప్రవర్తించినందుకు పార్లమెంట్‌కు క్షమాపణ చెబుతాను తప్ప ఆ ఎయిరిండియా ఉద్యోగికి మాత్రం క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని గైక్వాడ్‌ స్పష్టంచేశారు.

తనకు బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వలేదని ఫిర్యాదు రాయడానికి ఫిర్యాదుల బుక్ అడిగినందుకు తనతో ఎయిరిండియా సిబ్బంది తనతో వాగ్వివాదానికిదిగి తన కాలర్ పట్టుకున్నాడని పార్లమెంట్‌కు చెప్పుకొచ్చారు గైక్వాడ్. అంతేగాక పార్లమెంట్ గురించి, ప్రధాని గురించి ఆ ఉద్యోగి తప్పు మాట్లాడినందుకే అతన్ని కొట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు గైక్వాడ్.

అయితే మీడియాలో జరిగిన ఘటనలో ఒకవైపు కోణాన్ని మాత్రమే చూపించి తనను దోషిగా నిలబెట్టారన్నారు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.