నా కొడుకు బంగారం

Raviteja mother opens up on drugs case and Bharat Death issue

గత కొంతకాలంగా మీడియాలో బాగా నానుతున్న హీరో పేరు ఏంటంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు రవితేజ. తమ్ముడు భరత్ రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత మొదలైన దుమారానికి డ్రగ్స్‌ కేసులో రవితేజకు కూడా నోటీసులు ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారం తోడై అతన్ని హైలెట్ చేస్తున్నాయి.

Raviteja mother opens up on drugs case and Bharat Death issue

గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉండి ప్రపంచమంతా తిరిగి ఎంజాయ్ చేసి ఈమధ్యే మళ్ళీ హీరోగా సినిమా ఒప్పుకొని షూటింగ్‌కు హాజరవుతున్న హీరో రవితేజకు తమ్ముడు భరత్ యాక్సిడెంట్‌తో కొత్త కష్టాలు మొదలయ్యాయి. భరత్ చనిపోయినప్పుడు స్మశానవాటికకు వెళ్ళలేదని, కనీసం దహన సంస్కారాలు కూడా చేయలేదని వచ్చిన విమర్శలను పెద్దకర్మ రోజు అసలు ఏంజరిగిందో చెప్పి వెళ్ళిపోయిన రవితేజకు డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందాయంటూ ప్రచారం జరగుతోంది.

రవితేజకు కాకుండా ఆయన డ్రైవర్ కు నోటీసులు వెళ్లాయనే ప్రచారం కూడా ఉంది. అంత ఇప్పటి వరకు ఆయన దీనిపై స్పష్టం ఇవ్వలేదు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరి పేర్లు బయటికి వచ్చాయో వాళ్ళందరూ దాదాపు తమ వివరణ ఇచ్చేసరికి అసలు రవితేజకు డ్రగ్స్‌తో సంబంధం ఉందా లేదా అన్న దానిపై వివరణ ఇవ్వడానికి కూడా రవితేజ ముందుకు రాకపోవడంతో అనుమానాలు పెద్లేద ఎత్దుతున బయటికి వచ్చాయి.

See Also: రవితేజ ఎందుకలా చేశాడు??

అయితే కొడుకు భరత్ చనిపోయినప్పుడు విమర్శలు వచ్చినా కూడా బయటికిరాని రవితేజ తల్లి రాజ్యలక్ష్మి అకస్మాత్తుగా తెరపైకి వచ్చారు. తన కొడుకు తరుపున ఆమె మీడియాకు వివరణ ఇచ్చారు. అన్ని ఛానెల్స్‌కు ఓపికగా ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆమె రవితేజకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. అయితే డ్రగ్స్ వ్యవహారంలో రవితేజకు పోలీసుల నుంచి నోటీసులొచ్చినట్లు రాజ్యలక్ష్మి అంగీకరించారు. ఈ నెల 22న విచారణకు రవి హాజరవుతారని ఆమె తెలిపారు.

అయితే డ్రగ్స్ వ్యవహారంలో గిట్టని వారు కావాలనే రవితేజపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.కనీసం సిగరెట్ కూడా తాగే అలవాటు లేని రవితేజకు డ్రగ్స్ అంటకట్టడం మంచిది కాదని రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక రవితేజ ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదన్నారు. తమ్ముడి పోయిన దుఃఖంలో ఉన్నా.. నిర్మాతలు నష్టపోకూడదన్న కారణంతోనే రవితేజ షూటింగులకు హాజరయ్యాడని తెలిపారు.

See Also: కమిట్మెంట్‌కి మెచ్చుకోవాలా లేక…???

అంతేగాక తన పని తాను చేసుకుపోయే రవిని అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. భరత్‌ మద్యం మత్తులోనే రోడ్డుప్రమాదంలో చనిపోయాడనేది అవాస్తవమని రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. తమ కుటుంబ ఆచారం ప్రకారమే భరత్‌ అంత్యక్రియలకు హాజరు కాలేదన్నారు. భరత్‌ చనిపోయే కొద్దిరోజుల ముందే చెడు అలవాట్లను మానేశాడని.. బిగ్‌ బాస్‌ షోకు కూడా ఎంపికయ్యాడని.. ఆ ప్రయత్నంలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భరత్‌ను దారిలో పెట్టేందుకు తాను రేయింబవళ్లు కనిపెట్టుకుని ఉండేదాన్నని రాజ్యలక్ష్మి చెప్పారు. రవితేజ, భరత్‌ను ముడిపెట్టి చూడొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.