గెలుపు కోసమే రాజకీయ హత్యలు జరుగుతున్నాయా??

rayalaseema-becomes-center-point-for-political-murders-in-our-dirty-politics

rayalaseema-becomes-center-point-for-political-murders-in-our-dirty-politics

రాయలసీమను రతనాల సీమ చేయడానికి అక్కడ ఉండే ప్రజలు ఫ్యాక్షన్ రాజకీయాలను పక్కనబెట్టి చాలాకాలమే అయ్యింది. అయితే ఈమధ్య అప్పుడప్పుడు సీమ జిల్లాల్లో రాజకీయ హత్యలు జరగుతుండడంతో మళ్ళీ ఫ్యాక్షన్ పంజా విసురుతోంది. లేటెస్ట్‌గా పత్తికొండ వైఎస్సార్‌సీపీ నేత నారాయ‌ణ‌రెడ్డిని అతి కిరాత‌కంగా చంపేశారు ప్రత్యర్థి వర్గాలు. అయితే నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో ఈ హత్య జరగడంతో దీనికి రాజకీయ రంగు ఎక్కువగా పులుముకుంది. వైసీపీ నుండి గెలిచి టీడిపిలో చేరిన భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత నంద్యాలలో ఉపఎన్నిక జరుగనుండడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

వైసీపీకి నంద్యాల ప్రాంతం అనుకూలంగా ఉండడంతో అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు సైతం అంచనా వేసిన పరిస్థితుల్లో వైసీపీ నాయకుడి హత్య పెద్ద దుమారానికే తెరలేపింది. వీటికితోడు చంద్రబాబు రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షనేత జగన్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ మొదలైంది. నిజంగానే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఈ హత్య చేయించారని, దీనికి సీఎం చంద్రబాబు పూర్తిగా సహకరించారని జగన్ విమర్శలు చేయడంతో నిజంగానే చంద్రబాబు రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాయలసీమలో హత్యారాజకీయాలు పెద్ద దుమారానికే తెరలేపాయి. ప్రత్తికొండ వైఎస్సాఆర్సీపీ ఇంఛార్జ్ నారాయణరెడ్డి హత్య తరువాత అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. చాలా రోజులుగా నారాయణరెడ్డికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుకి మధ్య అగాధం చాలా పెద్దగానే ఉందని, ఇసుక మాఫియాపై నారాయణరెడ్డి పోరాటం చేయడంవల్లే కోర్టు దర్యాప్తు చేయమని ఆదేశించిందని స్థానికులు చెబుతున్నారు. కేఈ కుటుంబం ఇసుక దందాపై పోరాటం నేపథ్యంలో తన ప్రాణాలకు హానీ ఉందని, రక్షణ కల్పించాలని నారాయణరెడ్డి చాలాసార్లు పోలీసులను కోరారని చెబుతున్నారు. సెక్యూరిటీ కల్పించకపోగా, లెసెన్స్‌ రెన్యూవల్‌ పేరుతో ఉన్న ఆయుధాన్ని కూడా తీసేసుకుకోవడం వల్లే ఈ హత్య జరిగిందని వాపోతున్నారు స్థానికులు.

విపక్ష నాయకులను ప్రలోభాలకు గురిచేస్తూ, మాట వినకుంటే ప్రాణాలు తోడేస్తూ అధికార తెలుగుదేశం రాక్షస పరిపాలన సాగిస్తున్నదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డి హత్యలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.

ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌.. ఏపీలో జరుగుతోన్న రాక్షసకాండపై ఫిర్యాదుచేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు జైలుకు పోతే తప్ప వ్యవస్థ బాగుపడే పరిస్థితి లేదని అన్నారు. నారాయణరెడ్డి బతికుంటే టీడీపీకి మనుగడ ఉండదనే హత్యచేశారని, ఉద్దేశపూర్వకంగా గన్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయలేదని విమర్శించారు. అంతేగాక కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కొడుకు నేతృత్వంలో సాగుతోన్న ఇసుక మాఫియాపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించేదాకా నారాయణరెడ్డి పోరాడారరని అందుకే ఆయనను అడ్డుతప్పించారని జగన్ స్పష్టంచేశారు. నారాయణరెడ్డి హత్యను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేయిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా సహకరించారు అని జగన్‌ దుయ్యబట్టారు.

అంతేగాక గత మూడున్నరేళ్లలో టీడీపీ దారుణాలకు బలైపోయిన వైఎస్సార్‌సీపీ నేతల జాబితాను గవర్నర్‌కు అందించామని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.