‘రిజర్వ్‌ బ్యాంక్’ పరువు పోయింది

RBI Ex Governer YV Reddy sensational comments on RBI and demonetization

RBI Ex Governer YV Reddy sensational comments on RBI and demonetization

గతేడాది దేశాన్ని కుదిపేసేలా కేంద్రప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు తీసుకున్ననిర్ణయాన్ని ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు. దేశంలో జరిగిన పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని రిజర్వు బ్యాంకు ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అన్నారు. నల్లధనంపై సామాన్య ప్రజలు విరక్తి చెందడం వల్లే నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించలేదని… లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నా, నల్లధనాన్ని అరికట్టలేమని… అది మరో రూపంలో కొనసాగుతుందని తెలిపారు.

అంతేగాక పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంత నల్లధనం వెనక్కి వచ్చిందో చెప్పడం చాలా కష్టమని అన్నారు. నోట్ల రద్దు వలన రిజర్వు బ్యాంకు ప్రతిష్ట కాస్త మసకబారిందని, బ్యాంకులపై ప్రజలకు నమ్మకం కొనసాగాలని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ పరువును పెద్ద నోట్ల రద్దు గంగలో కలిపేసిందని అభిప్రాయపడ్డారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.