`హ‌రే రామ హ‌రే కృష్ణ‌` ప్రారంభం

Regina Dileep prakash starrer Hare rama Hare krishna movie started

Regina Dileep prakash starrer Hare rama Hare krishna movie started

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిలీప్‌ ప్రకాష్‌, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్‌సాయి దర్శకత్వంలో నవీన్‌ రెడ్డి ఎన్‌ నిర్మాతగా కొత్త చిత్రం `హ‌రే రామ హ‌రే కృష్ణ‌` రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి చందు మొండేటి క్లాప్‌ కొట్టగా, ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి వీరశంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. 

దర్శకుడు అర్జున్‌సాయి మాట్లాడుతూ ‘శ్రీమన్నారాయణ, ఢమరుకం, నక్షత్రం సినిమాలకు రచయితగా పనిచేశాను. దర్శకుడుగా నా తొలి చిత్రమిది. కామెడికి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ స్క్రిప్ట్‌ను తయారుచేసుకున్నాను. మే నెల ప్రథమార్థంలో కులుమనాలిలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది’ అన్నారు.

రెజీనా మాట్లాడుతూ ‘డిఫరెంట్‌ కథ, కథనాలతో సాగే చిత్రమిది. హెచ్‌.ఆర్‌.డిపార్ట్‌మెంట్‌లో కనపడే అమ్మాయి. సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గిపోతున్నాయి. అలా ఆదరణ తగ్గిపోతున్న సంప్రదాయ కళలను కాపాడటానికి ప్రయత్నించే యువతి పాత్రలో నేను నటిస్తున్నాను. నా పాత్రను దర్శకుడు అర్జున్‌గారు బాగా డిజైన్‌ చేశారు. ఈ సినిమాలో నా మదర్‌ పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ ఆమనిగారు నటిస్తున్నారు’ అన్నారు.

నిర్మాత నవీన్‌రెడ్డి ఎన్‌ మాట్లాడుతూ  ‘ఏడాదిన్నర క్రితం ఈ కథను దర్శకుడు అర్జున్‌ చెప్పారు. వినగానే బాగా నచ్చింది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా మా సినిమాను రూపొందిస్తాం. మంచి టీం కుదిరింది. ప్రకాష్‌రాజ్‌, రసూల్‌ ఎల్లోర్‌గారు ఒప్పుకోకుంటే సినిమా చేసేవాడిని. రెజీనా చాలా బిజీగా ఉన్నా, కథ నచ్చగానే సినిమా చేయడానికి ఒప్పుకోవడం ఆనందంగా ఉంది.తెలుగు, తమిళంలో ఏకకాలంలో సినిమాను తెరకెక్కిస్తాం’ అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.