మధుకర్ కేసులో వీడనున్న చిక్కుముడి?

Repostmortem to bringout truth soon in Madhukar case

Repostmortem to bringout truth soon in Madhukar case

మంథనిలో మధుకర్ మ‌ృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. 23 రోజుల క్రితం పాతి పెట్టిన మధుకర్ మృతదేహాన్ని బయటికి తీసి మధుకర్‌ తల్లిదండ్రుల సమక్షంలో ఉస్మానియా వైద్యులు ఫోరెన్సిక్‌ నిపుణులు దేవరాజ్‌, కాకతీయ వర్సిటీ నుంచి కృపాల్‌సింగ్‌ సుమారు నాలుగు గంటలపాటు శవపంచనామా నిర్వహించారు. నిపుణులు శవం కుళ్లిపోయిందని తెలిపారు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఏసీపీ సింధుశర్మ భద్రతా పర్యవేక్షణలో రీపోస్టుమార్టం నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

సంచలనంగా మారిన మధుకర్ మ‌ృతికేసులో మొదట పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసినప్పటికీ మృతుని తల్లదండ్రులు ప్రజాసంఘాలు మాత్రం పరువు హత్యేనని న్యాయం కోసం న్యాయస్థానం గడపతొక్కారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్థం చేయాలని ఆదేశించింది. దీంతో మంథనిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మధుకర్ రీ పోస్టుమార్టంలో ఏం తేలుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

రెండు భిన్న కులాలకు చెందిన మధుకర్, శిరీషలు ప్రేమించుకొని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డ సమయంలో మార్చి 13న శిరీష కుటుంబసభ్యుల దగ్గరకి ఓ వ్యక్తి మధుకర్‌ను తీసుకెళ్ళాడని అంటున్నారు. ఆ తర్వాత రోజు మధుకర్ మృతదేహం ముళ్ళపొదల్లో లభ్యమవగా, శిరీష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించింది. అయితే ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేయగా మధుకర్ చనిపోగా, శిరీష ప్రాణాలతో బయటపడిందని అమ్మాయి తరుపు బంధువులు పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులు శిరీషను విచారించగా ఆమె చాలా సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశామని చెప్పిన పోలీసులు రీ పోస్టుమార్టం రిపోర్టును వారం రోజుల్లో హైకోర్టుకు సీల్డ్ కవర్లో నేరుగా అందజేస్తామని చెప్పారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.