ఏడిపిస్తున్న బోరుబావులు

Rescue operations still continues in Rangareddy to save 19 months girl from Boar well
  • రంగారెడ్డి జిల్లా చన్‌వెల్లిలో ఘటన
  • నిన్న సాయంత్రం బోరుగుంతలో పడ్డ 19 నెలల చిన్నారి
  • పాపను కాపాడే ప్రయత్నాలు ముమ్మరం
  • కొనసాగుతున్న సహాయక చర్యలు 
 Rescue operations still continues in Rangareddy to save 19 months girl from Boar well
ఓ చిన్న నిర్లక్ష్యం అభంశుభం తెలియని ఓ చిన్నారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసింది. ఇప్పటికే ఎన్నో ఉదంతాలు మనముందు కనిపిస్తున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా రంగారెడ్డి జిల్లాలో మరో ఘటన తెరపైకి వచ్చింది. వికారాబాద్‌ జిల్లా యాలాల్‌ మండలం గోరేపల్లికి చెందిన కొటం యాదయ్య, రేణుక దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. వీళ్ళు బతుకుదెరువు కోసం చేవెళ్ల మండలం చన్‌వెల్లి వచ్చి తిరుమలి రాంరెడ్డి వద్ద పాలిహౌజ్‌లో పనిచేస్తున్నారు.
ప్రతీరోజులాగే దంపతులు ఇద్దరూ పొలంపనుల్లో ఉండగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కింద పెద్దపాప అక్షిత(2), మరోపాప (19 నెలలు) ఆడుకుంటున్నారు. సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో ప్రమాదవశాత్తు అక్కడి బోరుబావిలో రెండోపాప పడిపోయింది. పెద్దపాప అక్షిత ఏడుస్తూ  పరుగెత్తుకెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బోరువైపు పరుగులు తీశారు. లోపల చిన్నారి పడి ఉండటాన్ని గమనించి, చుట్టు పక్కల పనిచేస్తున్న రైతులకు విషయాన్ని తెలపడంతో వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులతోపాటు విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఆర్‌డీవో వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకున్నారు. జేసీబీల సహాయంతో బోరు చుట్టూ తవ్విస్తున్నారు. 40 ఫీట్ల లోతులో పడిపోయిన చిన్నారికి 108 అంబులెన్సు ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ఎన్‌డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా పాపను రక్షించడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వి చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  అయితే మోటర్‌తో సహా చిన్నారిని బయటికి తీసేందుకు ప్రయత్నించగా కేవలం మోటర్ మాత్రమే బయటికి వచ్చి చిన్నారి మరో వెండు అడుగులు క్రిందికి పడిపోయింది.
భోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఎన్‌డిఆర్ఎఫ్ బృందం తమ వంతు కృషి చేస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.