ఈనెల 21న విడుదలకు రెడీ అయిన రిజర్వేషన్

Reservation movie releasing on April 21st
Reservation movie releasing on April 21st
లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై.. “డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్”తో కలిసి..  స్వీయ రచన మరియు దర్శకత్వంలో బహుముఖ ప్రతిభాశాలి డాక్టర్ శివానంద యాలాల..  తెలుగు, హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో నిర్మిస్తున్న సంచలన చిత్రం “రిజర్వేషన్”. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ఈనెల 21 కి వాయిదా పడింది. తెలుగులో “రిజర్వేషన్” పేరుతొ రిలీజ్ ఆవుతున్న ఈ చిత్రం..  హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో “రిజర్వ్ ఏ నేషన్” పేరుతొ విడుదల కానుంది.
కపిల్ చౌదరి-మన్ ప్రీత్ కౌర్, దీపక్ పవార్, ఇమ్రాన్ ఖాన్, డా.సుధాకర్ గౌడ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని.. దర్శకనిర్మాత డాక్టర్ శివానంద యాలాల మాట్లాడుతూ.. “కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈనెల 14 న విడుదల కావాల్సిన “రిజర్వేషన్” చిత్రాన్ని ఇదే నెల 21 కి వాయిదా వేశాం. “రిజర్వేషన్స్”  ప్రతిభను నిరుత్సాహపరుస్తూ దేశాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయనే  వాదన ఒక వర్గపు ప్రజల్లో నాటుకుపోగా.. మరోవైపు రిజర్వేషన్స్ పెంచాలని దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. సున్నితమైన ఈ అంశాన్ని రెండు కోణాల్లో చర్చిస్తూ తీసిన సినిమా “రిజర్వేషన్” అన్నారు.
ఈక్వెడార్ దేశానికి చెందిన సోలోపాస్కలిన్ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ త్రిభాషా చిత్రానికి కెమెరా: నందగోపాల్, ఎడిటర్: వి.జి, కథ: డాక్టర్ బీనవేణి రామ్ షఫర్డ్,  సహ నిర్మాత: మనోహర్ అలివేణి, రచన- నిర్మాత-దర్శకత్వం: డాక్టర్ శివానంద్ యాలాల !!

Have something to add? Share it in the comments

Your email address will not be published.