రాష్ట్రపతి రాక సందర్భంగా హైదరాబాదీలకు ఆంక్షలు

Restrictions applied in some routes of Hyderabad for President visit for various engagements

Restrictions applied in some routes of Hyderabad for President visit for various engagements

రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనతో బుధవారం ట్రాఫిక్ చిక్కులు తప్పేట్లులేవు. బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోయే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపు ఉండనుంది. మద్యాహ్నం 12 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకొనే రాష్ట్రపతి అక్కడ కార్యక్రమం తరువాత సుమారు 1గంట 15 నిమిషాలకు రాజ్‌భవన్‌కు వెళ్ళనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ అడిటోరియంలో జరిగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగేజ్ యూనివర్సిటీ కార్యక్రమానికి హాజరువుతారు. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్టాకడి నుండి బయలుదేరి వెళ్తారు.

రాష్ట్రపతి ఈ రూట్లలో పర్యటించే సమయాల్లో ఆ రూట్లలో ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు ప్రకటించారు. వాహనాల మళ్లింపు, నిలిపివేయడాలు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్లే ఆర్టీసి బస్సు రూట్‌ను మళ్లిస్తుండడంతో వాహనదారులు, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలను సులువుగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రూట్లను చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

.

ఆర్టీసీ బస్సుల మళ్లింపు

* ఎన్‌సీసీ గేట్ నుంచి పాసు ఉన్న వాహనాదారులను మాత్రమే ఉస్మా నియా క్యాంపస్‌లోకి పంపిస్తారు. సాధారణ వాహనాలను డీడీ కాలనీ, విద్యానగర్ వైపు మళ్లిస్తారు.
* ప్రధాన డైవర్షన్ రాంనగర్ టీ జంక్షన్, విద్యానగర్ టీ జంక్షన్(డీడీ ఆసుపత్రి) వద్ద ఉంటుంది.
* తార్నాక నుంచి వెళ్లే రూట్ నెం. 3 ఆర్టీసి బస్సులు స్ట్రీట్ నెం. 8 హబ్సి గూడ, రామాంతపూర్, అంబర్‌పేట్ 6 జంక్షన్, నింబోలిఅడ్డా మీదుగా కాచిగూడ రూట్‌లో వెళ్లాలి.
* ఆఫ్జల్‌గంజ్ లేదా కోఠి నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనాలు చాదర్‌ఘాట్, నింబోలి అడ్డా, అంబర్‌పేట 6 జంక్షన్, అంబర్‌పేట్, రామాం తపూర్, హబ్సిగూడ స్ట్రీట్ నెం. 8 నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లాలి.
* దిల్‌సుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే 107 రూట్ బస్సులను విద్యానగర్ వద్ద మళ్లిస్తారు, ఈ బస్సులు హిందీ మహా విద్యా లయ, ఆర్టీసి ఎక్స్ రోడ్స్, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్ రూట్‌లో నడుస్తాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.