వర్మ ఇప్పుడేం వివాదాలు బయటపెడ్తాడో..!

RGV declares his is going to bring out the Controversies in NTR's Life

ఎన్టీఆర్ –  రామ్‌ గోపాల్ వర్మ. ఈ రెండు పేర్లు కలిసి చదవడానికి కూడా కాస్త వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు కీర్తిపతాకాన్ని ఎగరేసిన వ్యక్తి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అయితే, ఎవరూ ఆలోచించని సబ్జెక్టులను తీసుకొని తనదైన శైలిలో తక్కువ బడ్జెట్‌లో సినిమా తీయడమేకాకుండా మధ్యమధ్యలో ట్విట్టర్‌లాంటి సోషల్‌ మీడియాలో వివాదాలకు తెరలేపి అందరూ తిడుతూ ఉంటే ఎంజాయ్ చేసే వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ.

RGV declares his is going to bring out the Controversies in NTR's Life

అలాంటి రామ్‌గోపాల్ వర్మ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తీస్తానని ప్రకటించి పెద్ద సంచలనానికే తెరలేపారు. ఎందుకంటే కాంట్రవర్సీలు లేకుండా సినిమాలు తీయని వర్మ ఎన్టీఆర్ సబ్జెక్ట్‌ను ఎత్తుకోవడంతో ఇండస్ట్రీలో ఈ విషయం టాక్ ఆఫ్‌ ది డేగా మారింది. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వర్మ తన మాటలు, పాట ఉన్న ఆడియోని రిలీజ్ చేశారు. అంతేగాక ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను నందమూరి బాలకృష్ణ చేయనున్నారు.

తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలత్తెకునేలా చేసింది NTR అనబడే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు తెలుగువాడి ఛాతి గర్వంతో పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహానటుడే కాదు,మొత్తం తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు. నాకు ఆయనతో పర్సనల్ గా వున్న అనుబంధం ఏమిటంటే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అడవి రాముడు సినిమా చూడటానికి 23 సార్లు బస్ టికెట్ కి డబ్బుల్లేక 10 కిమీ దూరం కాలి నడకన వెళ్లేవాడిని.

See Also: వీడికిదేం నోటి దూల: RGV కి పోటీ అవుతున్నాడుగా

అంతే కాకుండా NTR తెలుగు దేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగులో నేల ఈనినట్టు వచ్చిన లక్షలాది మందిలో నేనూ వున్నాను .. అలాంటి అతి మామూలు నేను… ఇప్పుడు NTR జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకు ఎక్కించడం చాలా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అత్యంత నిజమైన ఆ మహామనిషి NTR బయోపిక్ లో ఆయన శత్రువులెవరో , నమ్మక ద్రోహులెవరో, ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలేమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా NTR చిత్రం లో చూపిస్తాను.

“ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అని రాయప్రోలు గారంటే, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా 8 కోట్ల తెలుగు వాళ్లలో కేవలం ఒకడిగా ప్రపంచంలో వున్న ప్రతి తెలుగువాడికి చెప్పేది ..ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి NTR ni” అంటూ తనదైన స్టైల్లో వర్మ బాంబు పేల్చేశారు.

See Also: సుకుమార్ ఆలోచనలన్నీ వినూత్నంగా ఉంటాయి: రకుల్

అంతేగాక వర్మ బయోపిక్‌లను తెరకెక్కించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇలా వచ్చినవే ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’, ‘వంగవీటి’, ‘రక్తచరిత్ర’ చిత్రాలు. ప్రస్తుతం వర్మ ‘న్యూక్లియర్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన తెరకెక్కించిన ‘సర్కార్‌ 3’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించే వర్మ ఆయన జీవిత చరమాంకంలో జరిగిన అనేక సున్నితమైన సంఘటనలను ఎవరినీ నొప్పించకుండా, అధికారంలో ఉన్న టిడిపిని ఇబ్బంది పెట్టకుండా ఎలా తెరకెక్కిస్తారన్న దానిపై ఇప్పటికే చర్చ మొదలైపోయింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.