ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదా పడే అవకాశం ..?

RK Nagar bypoll War for late Jayalalitha's bastion gets intense Chance of postpone

RK Nagar bypoll War for late Jayalalitha's bastion gets intense Chance of postpone

తమిళనాట రాజకీయాలు ఎవరికీ అర్థంకాని విధంగా వేగవంతంగా మారిపోతున్నాయి. జయలలిత మృతిచెందిన తర్వాత రాజకీయాల్లో మార్పులు చాలానే జరిగాయి. పన్నీర్ సెల్వం, శశికళ మధ్య గొడవలు, ఆ తర్వాత శశికళ అరెస్ట్ ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయాయి. ఈ మధ్యలో జయలలిత చనిపోయిన తర్వాత ఆర్కెనగర్‌కు ఉప ఎన్నికలు రావడం కూడా జరిగిపోయింది.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ గత రెండు రోజులుగా తమిళనాట జరుగుతున్న ఐటీ రైడ్స్ అక్కడి నాయకులతో పాటు ప్రజలను సైతం కలవరపెడుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యమంత్రి విజయభాస్కర్‌, నటుడు శరత్‌కుమార్‌ ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. గత కొన్ని రోజులుగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే రాష్ట్రంలో 32 ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని ఐటి అధికారులు తెలిపారు. దాడులు జరిగిన మంత్రి విజయభాస్కర్‌ శశికళ వర్గానికి చెందిన వ్యక్తి కాగా, నటుడు శరత్‌కుమార్‌ ఇటీవలే శశికళ మేనల్లుడు దినకరన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఆర్‌కే నగర్‌ నుంచి ఏఐఏడీఎంకే (అమ్మ) పార్టీ తరుపున దిన కరన్‌ పోటీ చేస్తున్నారు. తన నివాసం పై ఐటిశాఖ దాడులు నిర్వహించడాన్ని మంత్రి విజయభాస్కర్‌ తీవ్రం గా నిరసించారు.

అయితే విజయభాస్కర్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఐటీశాఖ ఓ నివేదికను తయారు చేసి ఎన్నికల కమిషన్‌కు పంపే సన్నాహాల్లో ఉన్నట్లు సమాచారం. ఆర్కె నగర్‌లో ఈ నెల 12న ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దాదాపు 89కోట్ల రూపాయలు చేతులు మారాయని అంచనాకొచ్చారు ఐటీ అధికారులు. అంతేగాక 5.5 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారని టాక్. అయితే ఈ నగదు ఉపఎన్నిక సందర్భంగా చెల్లింపులకు తీసుకొచ్చారనే ప్రాథమిక అంచనాకు వచ్చిన ఆదాయపు పన్నుశాఖ తమ నివేదికలో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించిందని సమాచారం. నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం ఆర్కె నగర్ ఉపఎన్నికను వాయిదా వే్తే పరిస్థితి ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

Have something to add? Share it in the comments

Your email address will not be published.