కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది మృతి

road accident in karnataka, 11 people died

road accident in karnataka, 11 people died

బెంగళూరు: కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఈ ఘటన చిత్ర దుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద 9వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. రెండు ఆటోలను, టెంపో ట్రావెలర్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అందులో ఒక ఆటో పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ఘటనలో 11 మంది కూలీలు మృతి చెందగా మరో 7 గరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడివున్నాయి. ఆటోలోని వారంతా విజయపుర జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది.

వేగంగా వస్తున్న లారీ టైరు పగిలి అదుపుతప్పి రెండు ఆటోలను, టెంపో ట్రావెలర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృత దేహాలను రాంపూర ఆస్పత్రిలో ఉంచినట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.