కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు.

మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్‌ కు చెందిన బస్సు అదుపుతప్పి రహదారిపై నుంచి కల్వర్టులోకి బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించి.

క్షతగాత్రులను నందిగామ, జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కు పోవడంతో ప్రయాణికులను బయటకు తీయడం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. ప్రమాద వివరాలను మంత్రి కామినేని శ్రీనివాస్ ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలకోసం విజయవాడకు తరలించాలని జిల్లా  వైద్యాధికారులను మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.