జగనన్నే నాకు అమ్మా, నాన్న: రోజా

Roja fires on Chandra babu in plenary and confirms on not leaving Jagan
గత కొన్ని రోజులుగా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పార్టీ వీడుతోందని వస్తున్న వార్తలను ఖండించేలా వైఎస్సాఆర్సీపీ ప్లీనరీలో తనదైన శైలిలో ప్రసంగించారు ఎమ్మెల్యే ఆర్కె రోజా. తనకు తల్లిదండ్రులు లేరని, తనకు అండగా నిలిచిన జగనన్నకు  చివరి రక్తపు బొట్టు వరకు తోడుంటానని ప్లీనరీ వేదిక సాక్షిగా ఉద్విగ్నంగా మాట్లాడారు.
YSRCP MLA Roja fires on Chandrababu and confirms she is not leaving Jagan
గుంటూరులో జరుగుతున్న వైయస్‌ఆర్సీపీ ప్లీనరీలో రోజా మహిళా సంక్షేమంపై పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. “నాకు మహిళలంటే ఆకాశంలో సగం అంటారు. ఏపీలో మాత్రం ఆడవాల్లకు ఆత్మగౌరవం లేదు. ఆడ వాళ్లు కన్నీల్లు పెడితే ఆ రాష్ట్ర్రం సుభిక్షంగా ఉండదంటారు. అందుకే వైయస్‌ఆర్‌ పాలనలో ఆడబిడ్డలకు ఆస్తులుగా సొంత ఇల్లు ఇచ్చారు. పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. తన సొంత బిడ్డ షర్మిలమ్మలాగా అందర్ని భావించారు. ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదవాలని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారని” చెప్పుకొచ్చారు రోజా.

See Also: అవినీతి చక్రవర్తి: 56కుంభకోణాలు, 3లక్షల కోట్ల అవినీతి

అంతేగాక ఇవాళ చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరవైందని, కాల్‌మనీ–సెక్స్‌ రాకెట్లు నడుపుతూ పాలకులే కాలయముళ్లుగా మారుతున్నారని ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలను వంచించడమే కాకుండా మహిళలను కోర్టుకు ఎక్కించిన వంచకుడు చంద్రబాబు అని, 14వేల200 కోట్ల రుణమాఫీ హామీని బంగాళఖాతంలో కలిపి డ్వాక్రా మహిళలకు టోకరా పెట్టారని ఘాటుగా స్పందించారు. డ్వాక్రాను నేనే కనిపెట్టాను అంటారు. సత్యనాదేళ్ల, పీవీ సింధు, అంబేడ్కర్‌కు భారత రత్న ఇప్పించింది తానే అని చంద్రబాబు సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటున్నారని రోజా విమర్శించారు.

See Also: త్వరలో నేరాల చక్రవర్తి పుస్తకం: యనమల

మరో రెండేళ్ల తరువాత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేస్తారని, అసెంబ్లీ టైగర్‌..ఆంధ్ర ఫ్యూచర్‌ ఆయనే అని రోజా అన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ చూస్తున్న చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని, రాజన్న మనల్ని వదిలేసి వెళ్లినా.. వైయస్‌ విజయమ్మ కడుపున పుట్టిన ముద్దు బిడ్డ వైయస్‌ జగనన్న మన మధ్య ఉన్నారని. మనకు జగనన్న ఉన్నారు. జగనన్నకు మనమందరం అండగా ఉండాలా? వద్దా? జగనన్నను ముఖ్యమంత్రి చేయడమే మనం రాజన్నకు నిజమైన నివాళి అంటూ జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు రోజా.

See Also: మహిళామంత్రులకే దిక్కులేదంటున్న రోజా

Have something to add? Share it in the comments

Your email address will not be published.