చిల్లర కష్టాలేందిరా బాబూ..!

Rumours Of Ban On 10 Rupee Coins Trigger Panic in India

Rumours Of Ban On 10 Rupee Coins Trigger Panic in India

ఒకటికాకపోతే మరొకటి మన నెత్తిన వచ్చిపడుతున్నాయి. మొన్నటివరకు పాత నోట్ల రద్దుతో అవస్థలు పడ్డ జనాలకు మళ్ళీ కొత్త తలనొప్పి తయారైంది. సోషల్‌మీడియా పుణ్యమా అని మంచి జరగడం సంగతి పక్కనబెడితే అనవసరమైన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి భయపెట్టే కల్చర్ మరీ ఎక్కువైంది. ఈమధ్య వాట్సప్‌, ఫేస్‌బుక్ లాంటి సోషల్‌మీడియా యాప్స్ వల్ల అనవసర రాద్ధాతం ఎక్కువౌతోంది. ఎవడికో మైండ్ దొబ్బి ఏదో రాస్తే దాన్ని ఓ పది గ్రూపుల్లో కాపీ పేస్ట్ చేయడం వల్ల జనాలకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి.

అలాంటి సమస్యే 10 రూపాయల నాణాలు చెల్లట్లేదనే పుకారు. ఈ పుకారు మరీ ఎంతలా విజృంభిస్తోందంటే జనాలు తిండి మాని కిడ్డీ బ్యాంకుల్లో, పోపు డబ్బాల్లో దాచుకున్న పది రూపాయల నాణాలను పట్టుకొని వాటిని మార్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. పుకార్లు ఎక్కువగా వినిపిస్తుండడంతో మనకెందుకులే తలనొప్పి అనుకొని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.. అటు వ్యాపారులు, ఇటు ప్రజలు వీటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.

కొందరు వ్యాపారులు 10 రూపాయల నాణాలు తీసుకుంటున్నా, తిరిగి వారి నుంచి ప్రజలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. పది నాణాలు మాకొద్దు.. నోటు ఉంటే ఇవ్వండి.. అంటూ దబాయించి మరీ వ్యాపారులను అడుగుతున్నారు. దీంతో చేసేది లేక పది నాణేలను వారు కూడా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.

 

సోషల్ మీడియాలో ప్రచారంలో ఇలా వదంతులు

* అసలు నాణేనికి భారత్ అనే హిందీ పదం, ఇండియా అనే ఇంగ్లిష్ పదం నాణేం అడ్డంలో ఉంటాయి.
* నకిలీ నాణేనికి ఈ పదాలు నిలువునా ఉంటాయి.
* అసలు నాణేనికి ఎలాంటి గీతలు ఉండవు.
* నకిలీ నాణేనికి నాలుగు సింహాల మీదుగా రెండు గీతలు అతికించిన విధంగా ఉంటాయి.

* అసలు నాణేనికి పైన 10 గీతలుంటాయి.
* నకిలీ నాణేనికి 15 గీతలుంటాయి.
* అసలు నాణేనికి 10 అనే సంఖ్య వెండి, బంగారు రంగుతో రెండింటిని అనుకుని ఉంటుంది.
* నకిలీ నాణెంలో కేవలం వెండి రంగులోనే 10 అనే సంఖ్య ఉంటుంది.
* అసలు నాణేనికి పైన రూపీ సింబల్ ఉంటుంది.
* నకిలీ నాణేనికి ఉండదు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.