జూన్‌లో వీడెవడు?

Sachin Joshi Tatineni Satya Veedevadu Ready to release in June
Sachin Joshi Tatineni Satya Veedevadu Ready to release in June

సచిన్‌  హీరోగా  ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా ఫేమ్‌ తాతినేని సత్య దర్శకత్వంలో వై కింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థపై రైనా జోషి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వీడెవడు’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే సమయంలో హీరోయిన్‌ను ఎవరు చంపారో తెలుసుకోవాలనే ఆసక్తినీ కలిగించింది. ఈ మర్డర్‌ మిస్టరీ చిక్కుముడి జూన్‌లో వీడనుంది. ఎందుకంటే… ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ – ‘‘సచిన్‌  కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారు. గాళ్‌ ఫ్రెండ్‌ను చంపాడనే ఆరోపణ మీద పోలీసులు అతణ్ణి అరెస్ట్‌ చేస్తారు. హీరో గాళ్‌ఫ్రెండ్‌ పాత్రలో హిందీ హీరోయిన్‌ ఈషా గుప్తా నటించారు. సినిమాలో సస్పెన్స్‌ అండ్‌ థ్రిల్‌తో పాటు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. జూన్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. 

Have something to add? Share it in the comments

Your email address will not be published.