నిహారికపై మనసులో మాట బయటపెట్టిన తేజు

Sai Dharam Tej denies the rumors of his marriage with Niharika Konidela

Sai Dharam Tej denies the rumors of his marriage with Niharika Konidela

మెగా ఫ్యామిలీలో బావామరదలికి పెళ్ళి అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్తలను ఖండిచాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం ఏమాత్రంలేదని, అది ఏమాత్రం నిజం కాదని ఖండిచాడు. అంతేగాక నిహారిక తనకు చెల్లెలాంటిదని చెప్పుకొచ్చాడు తేజు. అంతేగాక చిన్నప్పటినుండి ఒకే కుటంటుంలా అన్నాచెల్లెలుగా పెరిగామని, ఇలాంటి వార్తలు రాసేటప్పుడు అధికారికంగా ఒకసారి సరిచూసుకున్న తర్వాతే ప్రచురించాలని అందులోనూ ఆ వార్తలో ఒక మహిళ ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇలాంటి ఆధారరహిత వార్తలు చాలాబాధపెడ్తాయని చెప్పుకొచ్చాడు.

నాగబాబు కుమార్తె నిహారిక, హీరో సాయి ధరమ్‌ తేజ్‌‌లకు త్వరలో వివాహం జరగనున్నట్లు వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ పెళ్లి వార్తపై యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లో జోరుగా చర్చ జరుగింది. చిరంజీవి సోదరి విజయదుర్గ కుమారుడైన తేజుకి మరదలు అయిన నిహారిక పరస్పరం ఇష్టపడుతున్నారని, దాంతో ఈ పెళ్లికి కుటుంబసభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఫుల్‌గా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్‌ అయిన ఈ న్యూస్‌పై సాయి ధరమ్ తేజ్ స్పందించి అదంతా తప్డుపుడు ప్రచారమేనని ఖండించాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.