ఫిదా చేస్తోన్న మళయాళీ ముద్దుగుమ్మ

Sai pallavi Birthday Special Fidaa Motion Poster looks promising

Sai pallavi Birthday Special Fidaa Motion Poster looks promising

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా మళయాళ ముద్దుగుమ్మల హవానే కొనసాగుతోంది. గత కొన్నేళ్ళుగా ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్న హీరోయిన్లలో వీళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. లేటెస్ట్‌గా మళయాళ ప్రేమమ్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసి తెలుగులో తన లక్‌ను పరీక్షించుకోవడానికి రెడీ అయిన మళయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది సాయి పల్లవి. వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫిదాలో లీడ్ రోల్ చేస్తున్న సాయి పల్లవి బర్త్‌ డే సందర్భంగా ఫిదా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

సాయి పల్లవిని చూసి వరుణ్‌తేజ్ ఫిదా అయ్యాడోలేదో కానీ ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ఫిదా అవుతారనే అనిపిస్తోంది. ఎందుకంటే చిట్టిపొట్టి మిడ్డీలు, స్కర్ట్స్, షార్ట్స్ వేసుకుంటేనే గ్లామరస్ అనుకొనే ఈరోజుల్లో లంగాఓణీలో కూడా ఎంతో గ్లామరస్‌గా కనిపించొచ్చని 35 సెకన్లపాటు ఉన్న మోషన్ పోస్టర్‌లో సాయి పల్లవి నిరూపించింది.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని మే లో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు  నాని హీరోగా దిల్‌రాజు నిర్మిస్తున్న ఎంసీఎలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ ఇందులో కీలక పాత్ర చేయనున్నారని టాక్. హీరోయిన్ భూమిక సిస్టర్ రోల్‌లో కనిపించనుందని అంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.