మీడియాకు ఇంత పైత్యం అవసరమా??

Sai Purnima Missing Case - How insensitive can Media be

దేశ సమస్య ఏదో బయటపడ్డట్లు, జనాలు ఇప్పుడా ఆ వార్తను తెలుసుకోకపోతే సైనైడ్ తాగి చచ్చిపోతారన్నట్లు, మెరుగైన సమాజం కోసం అసలేం జరుగుతుందో చూపిస్తున్నాం అని చంకలు గుద్దుకుంటున్న కొన్ని తెలుగు న్యూస్ ఛానళ్ళను చూస్తుంటే మరీ ఇంత ఘోరంగా ఎందుకు తయారయ్యాయనిపిస్తోంది.

Sai Purnima Missing Case - How insensitive can Media be

ఏదో కుల్‌భూషణ్ జాదవ్ కేసునో లేక సిక్కిం అరుణాచల్‌లో చైనా కుతంత్రాల గురించో స్పెషల్ స్టోరీలు చేసి చూపిస్తే… అసలు అక్కడ ఏం జరుగుతోందని ప్రజలందరికీ తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అంతేగాని హైదరాబాద్‌కు చెందిన సాయిపూర్ణిమ కేసులో ఆ అమ్మాయి దొరికేవరకు హడావిడి ఏమైనా చేసారంటే… ఆ అమ్మాయి దొరకాలని ఆ తల్లిదండ్రుల మనోవేదనను చూపించాలనే తాపత్రయాన్ని ఎవరూ తప్పుబట్టరు. ఎందుకంటే సాధారంగా ఎవరైనా పిల్లలు మిస్సింగ్‌ అని కేసు నమోదు అయినప్పుడు వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని, వాళ్ళపై ఎలాంటి అఘాయిత్యం జరగకూడదనే బాధ్యత మీడియాకు సైతం ఉంటుందనేది అందరూ ఒప్పుకుంటారు.

అయితే సాయి పూర్ణిమ విషయంలో మాత్రం మీడియాలో కొన్ని న్యూస్ ఛానళ్ళు కాస్త అతి చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ‘హైదరాబాద్‌ వెళ్లను. ఇక్కడే ఉంటా. వచ్చిన వాళ్లు నా తల్లిదండ్రులు కాదు. హైదరాబాద్‌కు వెళ్లినా.. వారితో ఉండలేను’’ అంటూ పూర్ణిమసాయి చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ ప్రతినిధులు ముందు కంటతడి పెట్టింది. తరచూ చదవమని ఒత్తిడి తెచ్చారని, అందుకే ఇంట్లో నుంచి పారిపోయివచ్చానని వాపోయింది. దీంతో కూతురుని చూద్దామని ఎంతో ఆశతో పోలీసులతో కలిసి వచ్చిన తల్లిదండ్రులు నాగరాజు, విజయ నిరాశగా వెనుదిరిగారు. ఇక్కడి వరకు మీడియాలో వచ్చిన కథనాలపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు.

See Also: నటుడు ప్రదీప్ ఆత్మహత్య విషయంలో ‘మీడియా ఓవరాక్షన్’

ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్‌గా టీఆర్పీల కోసం కబాలి రా అంటూ సాయి పూర్ణిమ చేసిన డబ్‌ స్మాష్‌ని అదే పనిగా చూపిస్తూ , స్టోరీని నడిపించడం కోసం సైకాలజిస్టులను, సైకియాట్రిస్టులను, చిన్న పిల్లల డాక్టర్‌ల ఇంటర్వ్యూలు తీసుకొని ఒకవైపు వాళ్ళ ఇంటర్వ్యూ, మరోపక్క డబ్‌స్మాష్‌లను అదేపనిగా చూపిస్తూ ఆ కుటంబం పరువు బజారుకీడుస్తున్నారు. ఇప్పటికే ఆ చిన్నారి ఇంటి నుండి పారిపోయి ఆ కుటుంబాన్ని బజారులో అందరి ముందు తలదించుకొనేలా నిలబెడితే, న్యూస్ ఛానళ్ళు, మీడియాలో వస్తున్న కథనాలు, స్పెషల్ స్టోరీలు, డిస్కషన్లు వాళ్ళని మరితం క్రుంగదీస్తున్నాయి.

చిన్నారి కనిపించకుండా పోయినప్పుడు ఆ చిన్నారి దొరకాలని ఎలాంటి కథనాలు వచ్చినా పట్టించుకోని చుట్టాలు, స్నేహితులు కూడా ఆ చిన్నారి ఆచూకీ దొరికిన తర్వాత తల్లిదండ్రులతో తాను రాకుండా ఉండిపోయిందనే బాధలో ఉన్న తల్లిదండ్రులకు ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు గునపాల్లాగా గుండెల్లో గుచ్చుతున్నట్లు అనిపించడం ఖాయం. ఒకవేళ ఆ బాధలో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఏదైనా అఘాయిత్యం చేసుకున్నా కానీ, ఒకవేళ హైదరాబాద్‌కు సాయి పూర్ణిమ తిరిగి వచ్చిన తర్వాత రోడ్డుపై కనిపించిన ప్రతీ ఒక్కరు ఆ అమ్మాయిని వేధించేలా ప్రశ్నలు అడిగినప్పుడు మీడియా చేసిన అనవసర హడావిడి వల్ల ఒక చిన్నారి జీవితం నాశనం అయ్యిందని అప్పుడు బాధపడడం తప్ప ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదు.

See Also: టార్గెట్ వెంకయ్యనాయుడు: ఏపీలో ఇక వికసించే కమలాన్ని అడ్డుకొనేదెవరు??

Have something to add? Share it in the comments

Your email address will not be published.