అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఏప్రిల్ 21న విన్న‌ర్

Sai DharamTej Rakul Preet singh Winner movie world premier on Amazon Prime Videos from April 21st

 

Sai DharamTej Rakul Preet singh Winner movie world premier on Amazon Prime Videos from April 21st

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై విడుద‌ల‌య్యి క‌మ‌ర్షియ‌ల్ గా సూప‌ర్ బిజినెస్ చేసిన చిత్రం ‘విన్నర్’. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో  న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక.

ఈ చిత్రం మొట్ట‌మెద‌టిసారిగా డిజిట‌ల్ లో ట్రెండింగ్ క్రియోట్ చేయటానికి సిధ్ధ‌మ‌వుతుంది. డిజిటల్ రంగంలో కొత్త ఒర‌వ‌డి సృష్టించిన AMAZON కంపెనీ వారు ఇప్ప‌డుAMAZON ప్రైమ్ వీడియోస్ లో ఏప్రిల్ 21న ఎక్స్‌క్లూసివ్ వ‌రల్డ్ ప్రీమియ‌ర్ గా విన్న‌ర్ ని లైవ్ చేస్తున్నారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో న‌టించారు. కామెడి ప‌రంగా ఆలీ, వెన్నెల కిషోర్ చాలా బాగా చేశారు.

సెంటిమెంట్ ప‌రంగా జ‌గ‌పతిబాబు, సాయిధ‌ర‌మ్‌తేజ్ ల మ‌ద్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకున్నాయి. అలాగే డాన్స్ లు అల‌రించాయి. బిగ్ స్క్రీన్స్ పై అల‌రించిన విన్న‌ర్ ఇప్పుడు మీ మెబైల్ లోకి అందుబాటులో వుంది.

ఈ చిత్రానికి  కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి ర‌వి, నృత్యాలు: రాజు సుంద‌రం, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:గోపీచంద్ మ‌లినేని.

Have something to add? Share it in the comments

Your email address will not be published.